ఓరి దేవుడోయ్.. ఈసారి నిజంగానే రష్మిక విజయ్ దేవరకొండ ఆ పని చేసేసారా…? ఫ్యాన్స్ షాక్..!

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ అలాగే హీరోయిన్ రష్మిక మందన్నాలకు సంబంధించిన వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాల కాంబో సూపర్ హిట్. వీళ్లిద్దరి జంట తెరపై అదుర్స్ అనే చెప్పాలి. గీతాగోవిందం సినిమాతో సంచలనం సృష్టించారు ఈ జంట .

 

అయితే వీళ్ళు తెరపైనే కాదు తెర వెనక కూడా క్లోజ్ గా ఉన్నారు అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ ఇద్దరూ ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తారు కలిసే ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు ప్రేమించుకుంటున్నారు అంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రీసెంట్గా రష్మిక మందన్న కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఆ ఫొటోస్ లో రష్మిక చాలా క్యూట్ గా ఉంది. ఏదో షాపింగ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది .

అయితే అదే బ్యాక్ గ్రౌండ్ కలిగి ఉన్న ఫొటోస్ ని విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడం గమనార్హం . దీంతో వీళ్లిద్దరూ సీక్రెట్ గా ట్రిప్ ప్లాన్ చేశారా..? అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . అంతేకాదు వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఉందని కానీ వాళ్ళు ఆ విషయాన్ని బయట పెట్టడం లేదు అని.. బహుశా ఆ విషయం బయట పెడితే ఎక్కడ సినీ ఆఫర్స్ తగ్గిపోతాయో అనే భ్రమలో ఉన్నారేమోనని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!