ఫస్ట్ టైమ్ అలా చేసిన అల్లు అర్జున్ భార్య… నువ్వు కూడా తయారయ్యావా అంటూ కామెంట్స్ (వీడియో)..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అలాగే ఈయన భార్య స్నేహారెడ్డి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె తన భర్తతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఫోటోలను తన ఫాన్స్ తో పంచుకుంటుంది. అలాగే మెగా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా ఆమె తప్పక హాజరవుతుంది.

ముఖ్యంగా క్రిస్మస్, న్యూ ఇయర్, బర్తడే, మ్యారేజ్ డే స్టోరీలు స్వయంగా ప్లాన్ చేస్తుందని సమాచారం. ఇక ఇప్పటివరకు ఇంటికే పరిమితం అయిన స్నేహ రెడ్డి.. మొట్టమొదటిసారి కెమెరా ముందుకు వచ్చింది. కెమెరా ముందుకు రావడం అంటే.. సినిమాలలో హీరోయిన్ గా నటించడం కాదు.. ఫస్ట్ టైం ఓ యార్డ్ లో పాల్గొని స్నేహ. కిండర్ బ్రాండ్ కు సంబంధించిన కిండర్ ఎస్ చోకో ..బోన్ క్రిస్పీ ప్రోడక్ట్ ను ప్రమోట్ చేస్తూ యాడ్ షూట్ చేసింది.

ఇందులో అనవసరమైన మేకప్ తో హడావిడి చేయకుండా చాలా న్యాచురల్ గా కనిపించింది. యాడ్ కు కావాల్సిన విధంగా కెమెరా ముందు నటించింది. ఇక తమ అభిమాన హీరో భార్యను వెండితెరపై చూసి అందరూ షాక్ అయ్యారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన కొందరు..” నువ్వు కూడా ఇలా తయారయ్యావ్ ఏంటి స్నేహ. యాడ్లు చేయడం మొదలు పెట్టావుగా.. ఇక త్వరలోనే సినిమాల్లోకి కూడా వెళ్ళిపోతావు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)