‘ గుంటూరు కారం ‘ కి మహేష్ బాబు రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో 13 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమా తెరకెక్కింది. వీరిద్దరి డైరెక్షన్ లో ఇది మూడో సినిమా కాగా.. ఈ సినిమా సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు, శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అభిమానులకు ఫుల్ మీల్‌ పెట్టినటైంది. ఇక హారిక హాసిని బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు థ‌మన్‌ సంగీత దర్శకుడుగా వ్యవహరించాడు.

కాక ఇటీవల ఈ సినిమా మొదటి షో రిలీజై పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. ఇకపోతే ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నారని ఆసక్తి అందరిలో ఉంటుంది. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం రెమ్యూనరేషన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సాధారణంగా మహేష్ ఒక్క సినిమాకు రూ.70 కోట్ల వరకు డిమాండ్ చేస్తారు. కానీ ఈ సినిమాకు కేవలం రూ.50 కోట్లు వరకే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది.

అయితే మహేష్ సినిమాకు అంత తక్కువ రెమ్యున‌రేషన్ తీసుకోవడానికి కారణం లేకపోలేదు. ఈ సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్లో రావడమే అందుకు కారణం అట. ఈ సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్‌తో పాటు.. సొంత బ్యానర్ పై సినిమా రిలీజ్ కావడంతో తన రెమ్యూనరేషన్ను తగ్గించుకున్నాడని తెలుస్తోంది. ఏది ఏమైనా త్రివిక్రమ్ కోసం మహేష్ రెమ్యూనరేషన్ త‌గ్గించుకోవ‌డం చాలా హ్యాపీగా ఉందంటూ గురుజీ ఫ్యాన్స్ గురించి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.