మహేష్ ” గుంటూరు కారం “.. తేజ ” హనుమాన్ ” సినిమాలకి బెస్ట్ విషెస్ తెలియజేసిన ఆ స్టార్ హీరో..!

జనవరి 12 వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయినటువంటి గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలు అనౌన్స్ చేసిన నాటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తేజ సజ్జ హీరోగా నటించిన ” హనుమాన్ ” మూవీ చిన్న సినిమా అయినప్పటికీ స్టార్ హీరోతో పోటీ పడేందుకు సిద్ధమయ్యాడు.

అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ” గుంటూరు కారం ” సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టేందుకు ప‌క్క ప్లానింగ్ తో ఈ సంక్రాంతి బరిలో దిగాడు. ఇక ఈ రెండు సినిమాలకి కూడా స్టార్ హీరో నాని సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ తెలియజేశారు.

” గుంటూరు కారం మరియు హనుమాన్ సినిమాలు ఈ సంక్రాంతి సీజన్ను ఘనంగా ప్రారంభించాలని ఆశిస్తున్నాను. ఒకటి భారీ సంక్రాంతి ఎంటర్టైనర్. మరొకటి అండర్ డాగ్ దిగ్గజంగా మారుతుంది. రెండు జట్ల గెలుపు కోసం వేచి ఉండలేను ” అంటూ చెప్పుకొచ్చాడు నాని. ప్రస్తుతం నాని పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.