” హనుమాన్ ” రిలీజ్ నాడే ఆసక్తికర పోస్ట్ షేర్ చేసిన తేజ..!

యంగ్ హీరో తేజ సజ్జ తాజాగా నటించిన మూవీ ” హనుమాన్ “. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా నేడు రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇక ఇప్పటికే పలుచోట్ల ప్రీమియర్ షోలు కూడా పడిపోయాయి. ఇక నేడు రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ఈ సందర్భంలోనే తేజ ఓ ఆసక్తికర పోస్ట్ ని షేర్ చేశాడు. ” హనుమాన్ డెలివరీ చేయబడింది. కొన్ని గంటలలో మీరందరూ దీన్ని చూడబోతున్నారు. నా రెండున్నర సంవత్సరాల కష్టం.

దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు, మరెన్నో అడ్డంకులను చూసి చివరి అంశానికి చేరుకున్న. మిక్స్డ్ ఫీలింగ్స్ మనసంతా నిండిపోయింది. మీ అందరికీ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్ ” అంటూ పోస్టులో రాసుకు వచ్చాడు తేజ. ప్రస్తుతం తేజ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా రానున్న రోజుల్లో ఇంకెన్ని భారీ రికార్డులను నెలకొల్పుతుందో చూడాలి మరి.