60 ఏళ్ల క్రితం నాన్నకి మాట ఇచ్చా.. ఇప్పటికీ దాటలేదు.. ఏసుదాస్

ఏ సినిమా హిట్ అవ్వాలన్నా కచ్చితంగా సినిమాలో పాటలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే సినిమాకి పాట ఆరో ప్రాణం. ఆ పాటకు ఊపిరిగా గాన సరస్వతిగా ఉంటారు సింగర్ ఏసుదాస్. ఈయన పేరుకు మాత్రమే మలయాళీ అయినా సర్వభాష గాయకుడు. ఈయన పాడారంటే చాలు ఆ సినిమా చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. తన మధురమైన గానంతో ఇప్పటివరకు 40 వేలకు పైగా పాటలను పాడిన ఘనత ఏసుదాసుకి ఉంది. 1980 టైం లో చాలా పాటలను ఆలపించిన యేసుదాసు ఓ సమయంలో ఆయన పాడని సినిమా లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. 8 జాతీయ అవార్డులు పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ బిరుదులను కూడా సొంతం చేసుకున్నాడు.

Mammootty, Mohanlal, KS Chithra, and others extend birthday wishes to KJ  Yesudas | Malayalam Movie News - Times of India

ఈయన.. తాజాగా తన 84వ పుట్టినరోజున జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజకీయ రంగ ప్రవేశంపై వచ్చిన చర్చపై ఆయన మాట్లాడాడు. ఎందరో సినీ సెలబ్రిటీస్.. పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు.. ముఖ్యంగా మ్యూజిక్ ఇండస్ట్రీకి చెందిన ఇళయరాజా ఓ నేషనల్ పార్టీలో చేరారు. అలాంటిది ఇన్నేళ్లుగా పాపులర్ సింగర్ గా రాణిస్తున్న మీరు పాలిటిక్స్ లోకి రాకపోవడానికి కారణమేంటి అన్న ప్రశ్న ఎదురుకాగా.. నిజం చెప్పాలంటే పలు పొలిటికల్ పార్టీల నుంచి నాకు పిలుపు వచ్చింది అంటూ వివరించాడు.

How legendary singer KJ Yesudas cast a spell on Hindi film music

చిన్న వయసులోనే తన తండ్రి రాజకీయాల్లోకి వెళ్ళవద్దని గట్టిగా చెప్పారు.. అప్పుడే నేను ఆయనకు ఎట్టి పరిస్థితుల్లోనూ పాలిటిక్స్ లోకి వెళ్ళన‌ని మాట ఇచ్చా. అలా నేను తండ్రికి ఇచ్చిన మాటను మీర దలుచుకోలేదు అంటూ వివరించాడు. అందుకే రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేసిన యేసుదాసు.. కొందరు తన పేరుతో అభిమాన సంఘాల్ని ప్రారంభించమని సజెస్ట్ చేస్తున్నారని నేను తోసిపొచ్చాను అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా చెప్పాలంటే నాకు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏ ఖాతా లేదు అంటూ క్లారిటీ ఇచ్చేసాడు.