‘ గుంటూరు కారం ‘ ప్రీమియర్ షో టాక్.. ఊర మాస్ ఘాటు ఎంటర్టైనర్.. ఫ్యాన్స్ కి మాస్ జాతర..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో దాదాపు 13 ఏళ్ల తర్వాత గుంటూరు కారం సినిమా సిల్వ‌ర్ స్క్రీన్‌పై కనిపించబోతుంది. సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి. ఇక సినిమాకు ముందు రోజే గుంటూరు కారం ప్రీమియర్స్ పడ్డాయి. ఇక ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మహేష్ బాబు ఫుల్ ఫామ్ లో ఉండి వరుస హిట్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అదే టైంలో త్రివిక్రమ్ గత సినిమా అలవైకుంఠ‌పురంలో ఇండస్ట్రీ హిట్ అయింది. వీరిద్దరి కాంబో మూవీ కావ‌టంతో గుంటూరు కారం సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక సినిమా నుంచి ట్రైలర్, సాంగ్స్ బ‌జ్ క్రియేట్ చేశాయి. సంక్రాంతి గుంటూరు కారంతో గట్టిగా హిట్ కొడతాడని మూవీ మేకర్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మూవీలో మహేష్ మాస్ రోల్ చేశాడు. ఆయన జంటగా శ్రీ లీల, మీనాక్షి చౌదరి నటించిన.. ప్రకాష్ రాజ్‌, జగపతిబాబు, సునీల్ కీలక పాత్రలు నటించిన ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. థ‌మ‌న్‌ సంగీతం అందించాడు. జనవరి 11న ఈ మూవీ యూఎస్ ప్రీమియర్ షోలు విడుదలయ్యాయి. ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

మూవీ మాస్ కమర్షియల్ అంశాలతో కూడిన మదర్ సెంటిమెంట్‌అట. తల్లి బహిష్కరణకు గురైన కొడుకు స్టోరీ ఇది. తల్లి కొడుకులుగా రమ్యకృష్ణ, మహేష్ బాబు కనిపించారు. మెజార్టీ ఆడియన్స్ రివ్యూ ప్రకారం గుంటూరు కారం త్రివిక్రమ్ మార్క్ క‌మర్షియల్ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. మహేష్ బాబు కామెడీ, డైలాగ్స్, మేనరిజం బాగున్నాయి. ఎప్పుడూ లేనివిధంగా ఈ సినిమాలో డ్యాన్స్ స్టెప్పులు కూడా మహేష్ అదరగొట్టాడు. మహేష్ బాబు వన్ మ్యాన్ షోలా సినిమా నడిచింది. కుర్చీ మడత పెట్టి సాంగ్ శ్రీ లీలా, మహేష్ మాస్ స్టెప్స్ అయితే పాటకి హైలెట్గా నిలిచాయి. మహేష్ స్క్రీన్ ప్రజెంట్ క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులను మెప్పిస్తాయి.

Kurchi Madathapetti Lyric Video |Guntur Kaaram |Mahesh Babu| Sreeleela  |Trivikram | Thaman S - YouTube

యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉన్నాయి. సెకండ్ హాఫ్ పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. శ్రీ లీల డాన్స్‌ పరంగా ఓకే. ఆమె నటన అంతగా మెప్పించలేకపోయింది. రెండో హీరోయిన్ మీనాక్షి చౌదరి పాత్రకు అంత స్కోపే లేదనిపించింది. మదర్ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. సినిమాలో త్రివిక్రమ్ మార్క్ డైరెక్షన్ డైలాగ్స్ మిస్ అయ్యాయని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. థ‌మన్ సాంగ్స్ లో కుర్చీ మడతపెట్టి మాత్రమే ఆకట్టుకుంది. బిజిఎం పర్లేదు అనిపించిన గుంటూరు కారం.. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. మహేష్ ఫ్యాన్స్ కి మాస్ మసాలా పేస్ట్ మాత్రం ఫుల్ గా లభించింది. మహేష్ కేవలం తన భుజాల పైన సినిమా అంతా నడిపించాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ ప్రేక్షకులను నిరాశ పరిచే విధంగా ఉంది. మాస్ న‌చ్చే ఆడియ‌న్స్‌ సినిమాను చూడవచ్చు.