ద మోస్ట్ బ్యూటిఫుల్ అంటూ ఆ హీరోయిన్‌ని తెగ పొగిడేస్తున రెబల్ స్టార్.. అంత స్పెష‌ల్ ఎందుకంటే..?

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రెబల్ స్టార్.. గ‌తేడాది చివ‌రిలో స‌లార్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ దాదాపు నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి కల్కి 2898 ఏడి. మహానటి ఫేమ్ నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

వైజయంతి మూవీ బ్యానర్స్ పై అశ్విని ద‌త్త్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇటీవల దీపిక పుట్టినరోజు సందర్భంగా కల్కి టీమ్ ఆమెకు బర్త్డే విషెస్ తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక మూవీ హీరో ప్రభాస్ దీపికకు స్పెషల్గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

Deepika Padukone's Kalki 2898 AD Birthday Poster Unveiled

సోషల్ మీడియాను చాలా తక్కువగా యూస్ చేసే ప్రభాస్ తనకు కావాల్సిన వాళ్ళ పుట్టిన రోజులు వస్తే మాత్రం కచ్చితంగా గుర్తు పెట్టుకొని సమయానికి విష్ చేస్తూ ఉంటాడు. ఇక తాజాగా దీపిక పుట్టిన రోజు కావ‌డంతో ఆమె ఫోటోలు షేర్ చేస్తూ ద మోస్ట్ బ్యూటిఫుల్ దీపికకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీలాగే ఈ ఏడాది కూడా అందంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ స్పెషల్గా విష్ చేసాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో అంత దీపిక పదుకొనేకు విషెస్ తెలియజేశారు.