విక్టరీ వెంకటేష్ తో నటించిన ఇంతమంది స్టార్ హీరోయిన్స్ చనిపోయారని మీకు తెలుసా… పాపం ఈ ముద్దుగుమ్మలు…!!

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయ‌న‌ అద్భుతమైన సినిమాలతో ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ను తన వైపుకు తిప్పుకున్నాడు. విక్టరీ వెంకటేష్ సినిమా అంటేనే ఫ్యామిలీ మూవీ అనే ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఈయన తన కెరీర్ లోనే ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో పని చేశాడు. అంతేకాకుండా ఈయన సినిమాలతో ఎంతోమంది హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక ఈయనతో నటించిన కొంతమంది హీరోయిన్లు ప్రస్తుతం మన మధ్య లేరు. వారెవరో ఇప్పుడు చూద్దాం.

1. శ్రీదేవి:


శ్రీదేవి, వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన మూవీ ” క్షణక్షణం “. ఈ సినిమా ఫలితం కాస్త అటు ఇటు గా రావడంతో వీరి కాంబినేషన్లో మరో సినిమా రాలేదు. ఇక ఈ సినిమాతో వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారారట. ఇక శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించింది.

2. ఆర్తి అగర్వాల్:


నువ్వు నాకు.. నచ్చావు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆర్తి అగర్వాల్.. మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ఈ సినిమా లో నటించడం కోసం వెంకటేష్ ఈమెకు ఎంతో సహాయం చేశాడట. యాక్టింగ్ సమయంలో ఎలాంటి తప్పులు జరగకుండా దగ్గరుండి మరీ చూసుకున్నాడట వెంకటేష్. ఇక దీంతో వీరిద్దరి మధ్య కూడా స్నేహబంధం ఏర్పడింది. ఇక ఆర్తి అగర్వాల్ దురదృష్టవశాత్తూ మరణించింది.

3. సౌందర్య:


అందాల తార సౌందర్య, వెంకటేష్ కాంబోలో చాలా సినిమాలే వచ్చాయి. వీరి కాంబోలో సినిమా అంటే ప్రేక్షకులకి ఎంతో ఇష్టం కూడా. అలాగే వీరిద్దరూ కలిసి నటించిన ఎన్నో సినిమాలు హిట్ లు అయ్యాయి. ఇంకా అతి చిన్న వయసులోనే సౌందర్య ఈ లోకానికి దూరంగా వెళ్లిపోయింది.

ఇలా వెంకటేష్ హీరోయిన్లు కొందరు తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయారు. ఈ హీరోయిన్లు అందరూ కూడా నటనకు ప్రతిరూపం అనే చెప్పాలి.