“జిగేల్ రాణి” సాంగ్ లో సుకుమార్ అనుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. చేసుంటే జిల్ జిల్ జిగానే..!

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలలో హీరోయిన్స్ కన్నా ఐటెం సాంగ్స్ చేసే బ్యూటీ లే ఎక్కువగా పాపులారిటీ దక్కించుకుంటారు . ఈ విషయం మనందరికీ బాగా తెలిసిందే . ఆయన సినిమాలో ప్రతి చిన్న క్యారెక్టర్ ను చాలా అద్భుతంగా రాసుకుంటారు. మరి ముఖ్యంగా ఐటెం సాంగ్ చేసే అమ్మాయిల గురించి అయితే సుకుమార్ కోసం ఎక్కువగానే ఆలోచిస్తాడు . ఇప్పటివరకు ఆయన కెరియర్ లో తెరకెక్కిన ప్రతి సినిమాలోని ఐటెం పాటలు చేసిన హీరోయిన్ బాగా పాపులారిటీ దక్కించుకునింది .

అయితే గతంలో ఆయన తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి పాటలో పూజా హెగ్డే కనిపించింది . ఈ పాత్ర కోసం ముందుగా కీర్తి సురేష్ ని అనుకున్నారట . ఆ లుక్స్ కి కీర్తి సురేష్ ఇంకా బాగా సెట్ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారట . కానీ కీర్తి సురేష్ చేయను అనగానే ఆయన ఈ పాత్రను సెకండ్ కూడా ఆలోచించకుండా పూజ హెగ్డే కి ఇచ్చేసారట . అలా పూజా ఖాతాలో హిట్ పడింది.

కేవలం కీర్తి సురేష్ నే కాదు.. చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఆయన దర్శకత్వంలో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ మిస్ అయిపోయారు. ఆ తరువాత చాలా మంది బాధపడ్డారు. కాగా ప్రజెంట్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాతో గ్లోబల్ వైడ్ పాపులారిటి దక్కించుకోబోతున్నాడు బన్ని-సుకుమార్..!!