అడివిలో నగ్నంగా తిరుగుతున్న స్టార్ హీరో.. ఆర్జీవి రియాక్షన్ ఇదే..!!

బాలీవుడ్ స్టార్ హీరో విద్యుత్ జమ్వాల్ మన అందరికీ సుపరిచితమే. ఎన్టీఆర్ ” శక్తి ” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక అనంతరం ఊసరవెల్లిలో నటించినప్పటికీ పెద్దగా ఫేమస్ అవ్వలేదు. దీంతో ఫోర్స్ ద్వారా బాలీవుడ్ కు చేరుకున్నాడు. ఇక అక్కడ అనేక సినిమాలలో నటించి ప్రేక్షకులని అలరించాడు.

ఇక ప్రస్తుతం పలు సినిమా షూటింగ్ లలో బిజీగా ఉంటూనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈయన తన సోషల్ మీడియాలో నగ్నంగా ఉన్న ఫోటోలను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ప్రతి సంవత్సరం 7 నుంచి 10 రోజులు ఇలా కేటాయించాలని కూడా రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన ఫ్యాన్స్ ఏమైంది ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఇది ఇలా ఉంటే ఈయన ఫోటోలపై టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ పెట్టాడు. ” మీలోని జంతువులు బయటకు తీసుకురావడం ఇది చాలా సమయానుకూలమని నేను భావిస్తున్నా.. మీరు నిజంగా గ్రీకు దేవుడిలా కనిపిస్తున్నారు. మీకు కోటి వందనాలు ” అంటూ రాసుకు వచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం ఈయ‌న‌ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.