పెళ్లి సందడి సినిమతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది శ్రీ లీలా. మొదటి సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా తన నటనతో మంచి మార్కులు కొట్టేసిన శ్రీ లీల.. తర్వాత ధమాకా సినిమాతో బ్లాక్ పాస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వరుస అవకాశాలను అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ మూవీ తర్వాత వరుసగా 12 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రతినెలా శ్రీలీల నటించిన ఒక్కో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఇప్పటికి నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా ఇందులో బాలయ్య నటించిన భగవంత్ కేసరి మాత్రమే హిట్ అందుకొని నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. ఇక స్కంద, అదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఈ మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి నిర్మాతలకు నష్టాలు మిగిల్చాయి. ఈ మూడు సినిమాలకు కనీసం ఓపెనింగ్స్ కూడా దక్కలేదు. దీంతో నిర్మాతలు భారీగా నష్టపోయారని.. ఇలా మూడు నెలల వ్యాధిలో మూడు సినిమాలు డిజాస్టర్లుగా నిలవడంతో నిర్మాతలకు దాదాపు రూ.100 కోట్ల వరకు నష్టం జరిగిందట.
ఇప్పటివరకు ఇలాంటి చెత్త రికార్డు టాలీవుడ్‌లో ఏ స్టార్ హీరోయిన్ ఖాతాలను లేదు. కేవలం శ్రీలీల మాత్రమే ఇలాంటి రికార్డును సృష్టించింది. మూడు నెలల్లో రూ.100 కోట్లు నష్టం అంటే అది సాధారణ విషయం కాదు. దీంతో ఈమె నెక్స్ట్ సినిమాలైనా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందకపోతే టాలీవుడ్ నుంచి శ్రీలీలకు అవకాశాలు రావంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం శ్రీలీల మహేష్ బాబు గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ వస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో నటిస్తుంది. అయితే ఈ రెండు సినిమాలపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.