ఈ గింజలను రోజు తీసుకోవడం వల్ల ఐ సైట్ కు చెక్ పెట్టవచ్చని తెలుసా..?

ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ లో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కంటి సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చాలామంది ఐసెట్ ప్రాబ్లం తో ఇబ్బంది పడుతున్నారు. ఐదు సంవత్సరాలు పిల్లల నుంచి 60 సంవత్సరాల పిల్లల వరకు చాలామందిలో కంటి చూపు మందగిస్తుంది. ఫోన్, లాప్‌టాప్, టాబ్లెట్, టీవీ లాంటి స్మార్ట్ గాడ్జెట్స్ ను అధికంగా ఉపయోగించడం వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ఆహారపు అలవాట్లు.. పోషకాలు కొరత లోపించడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఏదేమైనా ఈ చూపు తగ్గడంతో ప్రతి ఒక్కరు స్పెట్స్‌పై ఆధారపడుతున్నారు.

అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే తప్పకుండా రోజు ఈ గింజలను కాస్త మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. ఇంతకీ ఆ గింజలు ఏంటి అనుకుంటున్నారా.. అవి సోంపు గింజలు. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి.. జీర్ణ సమస్యలకు చెక్‌ పెట్టడానికి ఎంతగానో సహకరించే సోంపు గింజలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. ముఖ్యంగా ఈ గింజల్లో ఉండే విటమిన్ ఏ, సి, ఐరన్, పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కంటి అనారోగ్యానికి చెక్ పెడతాయి. వీటిని ఎలా తీసుకుంటే కంటి చూపు మెరుగవుతుందో.. ఐసైట్‌ తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్లు సోంప్ గింజలను వేసి.. లో ఫ్లేమ్ లో 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి.

ఆ తరువాత అదే పాన్‌లో ఒక కప్పు బాదంపప్పు వేసి మంచిగా ఫ్రై చేసి ఆ రెండింటిని మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఇక నైట్ పడుకునే అరగంట ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో వన్ టేబుల్ స్పూన్ తయారు చేసిన ఈ సోంపు, బాదం పొడితో.. తేనె కలుపుకొని తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం కలుగుతుంది. కంటి చూపు మెరుగుపడడమే కాక నిద్ర సమస్యలో ఇబ్బంది పడే వారికి కూడా ఇది సహకరిస్తుంది. కళ్ళునీరు కారడం, కళ్ళు ఎరబడ్డం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే రాత్రివేళ ఈ మిశ్రమం కలిపిన పాలను త్రాగడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.