” కేజిఎఫ్ 3 ” సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్.. చూస్తే కెవ్వు కేకే..!!

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా.. దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ సెన్సేషనల్ ప్రాజెక్టులు ” కేజిఎఫ్ 1,2 ” సినిమాలు మనందరికీ తెలిసిందే. ఇక ఈ రెండు సినిమాలకి కొనసాగింపుగా ” కేజిఎఫ్ పార్ట్ 3 ” సినిమాని కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చాలామంది ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పట్ల దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇచ్చిన అప్డేట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమాకి కథ ఎప్పుడో సిద్ధం అయ్యిందని.. కానీ దర్శకుడిగా తాను వ్యవహరిస్తాడో లేదో తెలియదని తెలిపాడు.

ఇక దీంతో ఈ సినిమా మాత్రం చేస్తే ప్రశాంత్ నీల్ లేదా తన పర్యవేక్షణలో మరో దర్శకుడు చేసే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాపై యష్ అభిమానులతో పాటు… ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి.