నాని – పూజా హెగ్డే క్రేజీ కాంబోలో మూవీ.. డైరెక్టర్ ఎవరంటే..?!

నాచురల్ స్టార్ నాని తాజాగా హాయ్ నాన్న‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యవ్ ఫ్యామిలీ ఆడియన్స్ అందర్నీ ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక నాని ఏడాదికి తన నుంచి రెండు లేదా మూడు సినిమాలు రిలీజ్ అయ్యేలా కెరీర్ ప్లాన్ చేసుకున్నాడు. కాగా ప్రస్తుతం నాని – పూజ హెగ్డే కాంబోలో ఓ సినిమా రాబోతుందంటూ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. వరుస ఫ్లాప్‌ల కారణంగా పూజా హెగ్డేకు టాలీవుడ్ లో గ‌త కొంత కాలంగా ఆఫర్స్ తగ్గాయి.

ఇలాంటి నేస‌ద్యంలో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ మూవీలో ఛాన్స్ దక్కిందంటూ వార్తలు వినిపించడంతో ఫాన్స్ ఖుషి అవుతున్నారు. సిబి చక్రవర్తి డైరెక్షన్లో నాని హీరోగా తెరకెక్కుతున్న మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా ఫిక్స్ అయిందట. డాన్ శీను తో తమిళంలో బ్లాక్ బస్టర్ అందుకున్న సిబి చక్రవర్తి క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. శివ కార్తికేయన్‌తో ఇతడు తెర‌కెక్కించిన డాన్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక నానితో ఈ డైరెక్ట‌ర్ సినిమా తెరకెక్కించి ఈ సినిమా సక్సెస్ అందుకుంటే మరో మెట్టు పైకి ఎదుగుతాడు అనడంలో సందేహం లేదు.

ఇక నాని – పూజ హెగ్డే కాంబోలో రాబోతున్న ఈ సినిమా అర్జున్ రెడ్డి తరహా కాన్సెప్ట్‌తో రూపొందుతుంద‌ని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక నాని – పూజ కాంబోలో ఇప్పటి వరకు ఓ సినిమా కూడా రాలేదు. ఈ కాంబినేషన్ చాలా క్రేజీగా ఉండబోతుందని అభిమానులు ఫీల్ అవుతున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను మేకర్స్ రివీల్ చేసే అవకాశం ఉంది. నాని తర్వాత ప్రాజెక్టులు భారీ లెవెల్ లో ఉండబోతున్నాయని టాక్. పూజ హెగ్డే ఈ ప్రాజెక్టు గురించి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.