ఆ కారణంగా మొదటివారం రూ.40 కోట్లు నష్టపోయాం.. యానిమల్ ప్రొడ్యూసర్ సెన్సేషనల్ కామెంట్స్..

రణ్‌బీర్ కపూర్ హీరోగా.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రూ.1000 కోట్ల గ్రాస్ కొల్లగొడుతుంది అనుకున్న ఈ సినిమా కేవలం రూ.900 కోట్ల వసూలతో స‌ర్దుకుంది. అయితే యానిమల్ సినిమా కలెక్షన్లపై సినీ ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యులో కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటివరకు తమ సినిమా సుమారు రూ.800 కోట్లకు పైగా గ్రాస్‌వ‌సులను రాబట్టిందని.. కలెక్షన్‌ల‌ విషయములో వాస్తవాలే చెబుతున్నామని వివరించాడు. మేము ఇంకా వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరలేదు.

డిస్ట్రిబ్యూటర్స్ చెప్పిన లెక్కల ప్రకారం మొదటి వారంలో థియేటర్లు దొరక్క‌ దాదాపు మాకు రూ.40 కోట్ల నష్టం వచ్చింది అంటూ వివ‌రించాడు. లాంగ్ వీకెండ్ లేకపోవడం, ఏ సర్టిఫికెట్ సినిమా కావడం, 3:21 నిమిషాల రన్ టైం, అదే టైంలో సామ్ బహుదూర్ మూవీ రిలీజ్.. ఇవన్నీ కూడా థియేటర్స్ తక్కువ అవడానికి కారణాలు కావచ్చు.. మా సినిమాని చూడాలని ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ ఉన్న ధియేటర్లు సరిగ్గా దొరకలేదు.. దీంతో మాకు మొదటి వారం కాస్త తక్కువగానే కలెక్షన్లు వచ్చాయి. ఇక నడివి ఎక్కువగా ఉన్నది ఇబ్బంది కలిగించలేదు.. కాకపోతే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ చూడడానికి ప్రేక్షకులు ఇబ్బందిగా భావించినట్లు వెల్ల‌డించాడు..

విషయం ఏదైనా ఒక్క సినిమాతో అందరినీ సంతృప్తి పరచడం కుదరదు.. ప్రస్తుతం సందీప్ యానిమల్ ఓటీటీ వర్షన్‌ కోసం పనిచేస్తున్నాడు. కొత్త సీన్స్ యాడ్ చేయాలా.. లేదా అనే ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్ ఇండియా నిబంధనల ప్రకారం సెన్సార్ పూర్తయ్యాక తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సినిమాను రిలీజ్ చేయాలి. దీంతో కొత్త సీన్స్ యాడ్ చేసి మరోసారి సెన్సార్ తీసుకువెళ్ళాల‌ లేదా థియేటర్ వర్షన్ లోనే రిలీజ్ చేయాలా అనే దానిపై సందీప్ ఆలోచిస్తున్నాడు అంటూ ప్రణయ్ వివరించాడు.