విజయ్ ” ఫ్యామిలీ స్టార్ ” మూవీ ఆ ఏరియా షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్… రౌడీ బాయ్స్ బీ రెడీ..!

టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో.. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ లవ్ అండ్ అట్రాక్షన్ మూవీ ” ఫ్యామిలీ స్టార్ “. ఈ సినిమాపై విజయ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

గీత గోవిందం మూవీ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అని ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పై అప్డేట్ వినిపిస్తుంది. ఈ మూవీకి సంబంధించిన అమెరికా షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయ్యిందట.

అయితే త్వరలో హైదరాబాద్ షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారట మేకర్స్. ఒక వారం లేదా పది రోజుల్లో ఈ షెడ్యూల్ పై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మృణాల్ ఠాకూర్, దివ్యాన్షా కౌశిక్, అజయ్ ఘోష్ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.