ఒక్క నైట్ డిన్నర్ కోసం ప్రభాస్ ఏకంగా అన్ని లక్షలు ఖర్చు చేస్తాడా.. అది ప్రభాస్ రాజు రేంజ్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచి ఫుడ్డీ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రభాస్ తో వర్క్ చేసే సెలబ్రిటీస్ ఎవరైనా.. ప్ర‌భాస్ భోజనం పెట్టి జనాన్ని చంపేస్తాడు అంటూ చెబుతారు. తనతో వర్క్ చేసే సెలబ్రిటీలకి ఇష్టమైన వంటలు అన్ని వండించి తీసుకొచ్చి మరీ పెట్టడం ప్రభాస్ కు మొదటి నుంచి అలవాటే. అలాగే ప్రభాస్ ఎప్పుడు భోజనం చేసినా తనతో పాటు ఓ 10 మంది లేదా 20 మంది కలిసి భోజనం చేస్తూ ఉంటారు. వీరందరికి తన డబ్బులతోనే భోజనం పెట్టిస్తాడు రెబల్ స్టార్. ఇక అన్ని రకాల వంటకాలు ప్రభాస్ భోజనం మెనులో కచ్చితంగా ఉంటాయట.

When Prabhas treated his 'Saaho' co-star Shraddha Kapoor to a  Baahubali-size lunch

ఎందుకంటే రెబల్ స్టార్ ఎప్పుడు ఏది తింటాడో ఎవరికి తెలియదట. అందుకే అన్ని రకాల వంటలు ముందే రెడీ చేసి పెడతారు. ప్రభాస్ కి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి తన వెంట ఒక టీం ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. మెజారిటీగా గోదావరి స్టైల్ వంటకాలను ప్రభాస్ చాలా ఇష్టంగా తింటారు. ఒక్కోసారి సెట్ లో వర్క్ చేసే అందరికీ కూడా ప్రభాస్ భోజనం తెప్పిస్తూ ఉంటాడట. ఇక ఇప్పటికే దీపికా పదుకొనే, కృతి సనన్‌ లాంటి స్టార్ హీరోయిన్లు కూడా ప్రభాస్ చేతి భోజనం టేస్ట్ చేశారు. అతను పెట్టే ఫుడ్ తింటే రెగ్యులర్గా ఫాలో అయ్యే డైట్ మర్చిపోవాల్సిందే అంటూ ఈ స్టార్ హీరోయిన్స్ కామెంట్స్ కూడా చేశారు.

Prabhas treats Deepika to Andhra meals on sets of 'Project-K'

అంటే ప్రభాస్ ఆతిథ్యం ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్‌ కూడా ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇలా ఒక్కరోజు ప్రభాస్ డిన్నర్ ఖర్చు ఏకంగా లక్షల్లో ఉంటుందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. సుమారు రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు ఒక రాత్రి ఫుడ్ కోసమే ప్రభాస్ ఖర్చు చేస్తాడట. ఈ స్థాయిలో భోజనం కోసం ఖర్చు చేసే హీరోలు టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ ఫిలిమ్ స్క్రీన్ పై ఎవ్వరు లేరు అని చెప్పాలి. ఇక కాంట్రవర్సీలకు దూరంగా ఉండే ఏకైక హీరో కూడా ప్రభాస్. అందుకే అందరూ హీరోలు ప్రభాస్ మూవీస్ చూడడానికి ఆసక్తి చూపిస్తారు.