” రోడ్డుపైనే డ్రెస్ విప్పి అలాంటి పని చేశాను.. ఆ సమయంలో తారక్ నాతో అలా ప్రవర్తించాడు “… నటి సెన్సేషనల్ కామెంట్స్..!

బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె ఎన్టీఆర్ హీరోగా నటించిన ఊసరవెల్లి సినిమాలో తమన్నా స్నేహితురాలుగా నటించింది. అలాగే ఈ బ్యూటీ తెలుగులో చేసిన మొదటి సినిమా ప్రయాణం. అంతేకాకుండా మిస్టర్ రాస్కెల్ సినిమాలో కూడా నటించింది. ఇక బాలీవుడ్ బ్యూటీ అయిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీపై ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంటుందని.. బాలీవుడ్ తో పోలిస్తే తెలుగు ఇండస్ట్రీ నే చాలా గొప్పదంటూ కామెంట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా సలార్ మరియు డంకీ సినిమాలు చెత్తగా ఉన్నాయంటూ రివ్యూ ఇచ్చి తమ అభిమానులను కించపరిచింది. అంతేకాకుండా ఎన్టీఆర్ గురించి ఓ విషయాన్ని బయట పెట్టింది.

అదేంటంటే.. ఎన్టీఆర్, తమన్నా కాంబినేషన్లో వచ్చిన ఊసరవెల్లి సినిమాలో పాయల్ కూడా ఓ కీలక పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాలో చేసే సమయంలో థాయిలాండ్ లో ఓ రోజు షూటింగ్ జరిగినప్పుడు పాయల్ రోడ్డు మీద బట్టలు మార్చుకుంద‌ట. ఇక ఇది చూసిన జూనియర్ ఎన్టీఆర్ చాలా కోపంతో ఈమెను తిట్టాడట. ఇక ఈ విషయాన్ని స్వయంగా పాయల్ ఏ ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.