మగాడు గొప్పోడు తన పక్కలో పడుకునే ఛాన్స్ ఇస్తాడు.. పెళ్లి పై యాంకర్ రష్మీ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే గతంలో జబర్దస్త్ యాక్టర్ సుధీర్ తో రష్మీ లవ్ ట్రాక్ చేసిన‌ సంగతి తెలిసిందే. వీరిద్దరిలో లవ్ ట్రాక్ కాన్సెప్ట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. స్టేజ్ పై వీరిద్దరూ పెళ్ళి కాన్సెప్ట్ తో వచ్చిన కార్యక్రమాలు ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో రష్మి, సుధీర్ లవ్ ఎఫైర్స్ గురించి కొంత కాలంగా చర్చలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అంతేకాదు ఈ జంట కలిస్తే బాగుండు అంటూ కోరుకునే సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది.

అయితే సుధీర్ గత కొంతకాలంగా బుల్లితెరకు గుడ్ బై చెప్పి కేవలం వెండితెరపై మాత్రమే సినిమాల్లో మెరుస్తున్నాడు. ఇక రష్మీ అటు సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటేనే.. బుల్లితెరపై శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ లాంటి షోలతో బిజీగా గడుపుతోంది. ఇక ఈ టీవీలో సందర్భానికి తగ్గట్లుగా కొత్త షోలు టెలికాస్ట్ అవుతూ ఉంటాయన్న సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ సందర్భంగా రష్మీ పెళ్లి పార్టీ పేరుతో ఓ ప్రోగ్రాంను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ పార్టీకి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఇందులో భాగంగా రష్మి పెళ్లిపై చేసిన బోల్డ్ కామెంట్స్ ప్రస్తుతం మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

ఈ షోలో బుల్లితెర నటీనటులు, బిగ్ బాస్ సెలబ్రిటీస్ తో పాటు డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ బాబా భాస్కర్, అమ్మ రాజశేఖర్ కూడా హాజరయ్యారు. ఎప్పటిలాగే హైపర్ ఆది, ర‌ష్మి మధ్య జరిగే కాన్వర్జేషన్ నవ్వులు కురిపించింది. తర్వాత ఈ ఈవెంట్ కు చమ్మక్ చంద్ర రావడంతో రష్మీ ఆయన పాదాలకు నమస్కరించింది. ఆ తర్వాత ఏంటి ర‌ష్మి నా కాళ్లకు మొక్కుతున్నవ్ అని చమ్మక్ చంద్ర అడగ్గా.. మగాడు చాలా గొప్పవాడు, ఆడపిల్లకు తాళి కట్టి ఆలిని చేసుకుంటాడు.. తన పక్కలో పడుకునేందుకు ఛాన్స్ ఇస్తాడు. సంవ‌త్స‌రం తిరిగేసరికి ఒక బిడ్డని ఇస్తారు అంటూ చెప్పుకొచ్చింది. అది విన్న బాబా భాస్కర్ రష్మీ పై సెటైర్లు వేశాడు. దీంతో షోలో అంతా నవ్వులు పూసాయి.

అయితే మగాళ్లు అంటే నీకు చిన్నపాటి గౌరవం ఉందని నాకు తెలుసు.. కానీ మరీ ఇంత గౌరవం ఉందని తెలియదు అని చమ్మక్ చంద్ర అంటాడు. దీనిపై స్పందించిన రష్మి పిచ్చి ప్రాణం అండి నాకు మగాళ్లు అంటే.. అంటూ చెప్పుకొస్తుంది. అయితే ఇదంతా స్కిట్లో భాగంగా రష్మీ చేస్తున్నదని తెలిసిన.. కాస్త పర్సనల్ ఒపీనియన్ కూడా ఇందులో కలిసిందేమో అంటూ నెటిజ‌న్స్ కామెంట్ చేస్తున్నారు. కాగ‌ ఈ కార్యక్రమానికి హనుమాన్ హీరో తేజ సజ్జ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఇక ఈ షో ఫుల్ ఎపిసోడ్ డిసెంబర్ 31న రాత్రి 9:30 నిమిషాలకు టెలికాస్ట్ అవుతుంది.