ఎట్టకేలకు తన సీక్రెట్ లవ్ నీ బయటపెట్టేసిన జబర్దస్త్ పొట్టి నరేష్..!!

జబర్దస్త్ షోలో కమెడియన్ పొట్టి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన హైటుతోనే కామెడీ డైలాగులతో స్కిట్లు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటూ ఉంటారు జబర్దస్త్ కమెడియన్స్. అయితే చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ జబర్దస్త్ నరేష్ అసలు వయసు మాత్రం 25 సంవత్సరాలట. దాదాపుగా జబర్దస్త్ షోలోనే కొన్నేళ్లపాటు కొనసాగుతూ ఉన్నారు జబర్దస్త్ నరేష్..ఎప్పుడు కూడా తన స్టేజ్ పైన పెళ్లి, ప్రేమ పైన కామెడీ చేస్తూ నవ్విస్తూ ఉండేవారు. తన పైన ఎలాంటి పంచులు వేసిన కూడా పాజిటివ్ గానే తీసుకునేవారు.

ఎక్కువగా నరేష్ పెళ్లి, ప్రేమ వ్యవహారాల గురించి స్కిట్ కూడా ఉండేవి.. కానీ రియల్ లైఫ్ లో మాత్రం తాను అన్నిటిలోనూ తగ్గేదే లేదు అనే అంతగా నిరూపించుకోవడం జరిగింది. ఇన్నాళ్లు దాచిన ఒక సీక్రెట్ ను సైతం బయట పెట్టడం జరిగింది నరేష్.. తనకు కూడా ఒక లవర్ ఉందంటూ తెలియజేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు.. ఇప్పటివరకు తన లవ్ ని చాలా సీక్రెట్ గా మైంటైన్ చేశానని ఎట్టకేలకు ఇప్పుడు ఆ విషయాన్ని బయట పెడుతున్నట్లు తెలియజేయడం జరిగింది.

ఈ మేరకు ఒక షోలో అందరి ముందు తన ప్రియురాలని పరిచయం చేశారు జబర్దస్త్ నరేష్.. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో తన ప్రియురాలిని ఇంట్రడక్షన్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.. ఈ విషయం చెప్పడానికి చాలా ఆత్రుతగా ఉన్నానని చెప్పడంలోనే తన ప్రియురాలు స్టేజి మీదకి ఆహ్వానించారు.దీంతో స్టేజి మీదకి వచ్చిన ఈమె ఎప్పటిలాగానే వీరి పైన కూడా లవ్ డ్యూయెట్లు చేశారు. తమ ఇద్దరి మధ్య రెండేళ్ల పాటు ప్రేమ కొనసాగుతోందని తెలియజేయడం జరిగింది. అందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారుతున్నది.