తను చేసుకోబోయే భర్తకు అలాంటి క్వాలిటీస్ ఉండాలంటూ కండిషన్ పెడుతున్న శ్రీ లీల..!!

కన్నడ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ శ్రీ లీల అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల ఈమె నటించిన చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం శ్రీ లీల చేతిలో గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్, ఎక్స్ట్రార్డినరీ తదితర సినిమాలో ఉన్నాయి వరుసగా ఆఫర్లు అందుకుంటూనే రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

చాలామంది హీరోయిన్స్ సైతం కొన్నేళ్లు కష్టపడుతున్న రాని ఇమేజ్ కేవలం శ్రీ లీల రెండేళ్లలోపే సంపాదించుకుంది. ఇలా కుర్రకారుల కలల రాణిగా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఎనర్జీ డాన్సులకు సపరేటు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. ఈ క్రమంలోనే శ్రీలీల ఎవరిని వివాహం చేసుకుంటుంది అనే విషయం పైన అడగడం జరిగింది. వాటికి సంబంధించి పలు విషయాలు తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.. శ్రీ లీల ఈ విషయం పైన మాట్లాడుతూ తనకు కాబోయే భర్తకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం ఉండాలని కుటుంబ విలువలు పాటించాల్సి ఉంటుందని సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఉండాలని తెలుపుతోంది.

కొన్నిసార్లు నన్ను తట్టుకోవడం చాలా కష్టము కాబట్టి భరించేవారు అయ్యుండాలని అందరితోపాటు కలిసిపోయే లక్షణాలు కూడా ఉన్నవాడే తనకు భర్తగా రావాలని ఓపెన్ అయ్యింది శ్రీ లీల. ప్రస్తుతం ఈమె వయసు 22 ఏళ్ళు అప్పుడే పెళ్లి చేసుకొనే అవకాశం లేదు కనుక చదువు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇటీవలే MBBS కు సంబంధించి పరీక్షలు కూడా రాస్తూ వస్తోంది. శ్రీ లీల తల్లి కూడా ప్రముఖ గైనకాలజిస్ట్.