సమంత వల్లే పూజా హెగ్డే మళ్లీ టాలీవుడ్ రీ ఎంట్రీ..!!

టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో స్టార్ డమ్ సంపాదించుకున్నది.. ఇటీవలే మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో అలాగే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ వాటి సినిమాలను రిజెక్ట్ చేసినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత ఈమె తెలుగులో ఏ ఒక్క సినిమాలో కూడా అవకాశం రాలేదు. ఇప్పుడు నాని నటిస్తున్న సరిపోదా శనివారం అనే సినిమా లో ఈమె హీరోయిన్గా నటిస్తున్నది.

మొదట ఈ సినిమాలో ప్రియాంక మోహన్ నటించబోతోంది అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఆమె డేట్లు అడ్జస్ట్ లేక ఈ సినిమా పూజ హెగ్డే కి వెళ్ళిందని సమాచారం. అయితే సమంత కారణంగా పూజా హెగ్డే కి టాలీవుడ్లో సినిమా అవకాశాలు వస్తున్నట్లు సమాచారం అసలు విషయం ఏమిటంటే డైరెక్టర్ నందిని రెడ్డి సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఒక సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకోసం చాలా రోజుల నుంచి సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సమంత రెస్ట్ మూడు లో నుంచి ఇంకా బయటికి రాని నేపథ్యంలో ఈ సినిమా చేయలేనని నందిని రెడ్డికి తేల్చి చెప్పేస్తుందట.

అయితే ఎవరిని తీసుకుంటే బాగుంటుందని ఆలోచనలో పూజ హెగ్డే అయితే కరెక్ట్ గా ఉంటుందని చిత్ర బృందం భావించడంతో ఆమెను సంప్రదించినట్లు సమాచారం.. ఆమె కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి బాలీవుడ్లో షాహిద్ కపూర్ తో ఒక సినిమాలో నటిస్తోంది పూజా హెగ్డే .ఈ సినిమా అయిపోయిన తర్వాత మరి సినిమాను కూడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరి త్వరలోనే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.