ఆత్మహత్య చేసుకోవాలనుకున్న దీపికా పదుకొనే.. కారణం..?

కొన్ని సందర్భాలలో కొంతమంది నటీనటుల సైతం తమ జీవితంలో జరిగిన కొన్ని విషయాలలో తెలియజేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న దీపికా పదుకొనే కూడా ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలనుకుందట. అయితే ఈ హీరోయిన్ ఎందుకు అలా చేయాలనుకుంది వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Deepika Padukone On Marriage Ranveer Singh: He Puts Me, My Dreams, And My  Ambitions First

NGO సమావేశంలో పాల్గొన్న దీపికా పదుకొనే తాను డిప్రెషన్ తో ఎలా పోరాడాలని విషయాన్ని మరొకసారి తెలియజేసింది. ఈ లక్షణాలు తన తల్లి తొలిసారిగా అర్థం చేసుకుందని తెలియజేయడం జరిగింది. ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు మానసికంగా కృంగిపోయిన తన తల్లి కూడా తనని ఎలా అర్థం చేసుకొని బయటపడేలా చేసిందని విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అయితే తాను ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి స్పష్టమైన కారణం లేదు.. కానీ ఎందుకో చాలా బ్రేక్ అయ్యాను సరిగ్గా నిద్రపోయిన రోజు కూడా లేదు తెలిపింది.. ఎన్నోసార్లు ఆత్మహత్య ప్రయత్నాలు చేశాను ఇలాంటి వాటిని ఎదుర్కొని తన తల్లి తనకు అండగా నిలిచింది అని తెలుపుతోంది.

Blast From The Past: When Deepika Padukone put her career on the line by  openly talking about mental health struggles for the 1st time - Masala

తన తల్లిదండ్రులు ఎన్నోసార్లు తనని చూడడానికి వచ్చినప్పుడు తాను చాలా గంభీరంగా కనిపించాలనుకుంటున్నాను కానీ ఒక్కసారి బెంగళూరు నుంచి తనను చూసి వెళ్ళిపోతున్న తరుణంలో తనకి అకస్మాత్తుగా ఏడుపు వచ్చిందని తెలియజేసింది.. ఇక తల్లిదండ్రులు మాత్రం తనని బాయ్ ఫ్రెండ్ లేదా ఏదైనా సమస్య ఉందా ఇంకేమైనా జరిగిందా అనే ప్రశ్నలు కూడా అడిగారు.. ఏ దానికి కూడా తన దగ్గర సమాధానం లేదు ఎందుకంటే ఆ సమయంలో ఏంటో తనకు కూడా అర్థం కావడం లేదని తెలిపింది. కేవలం తీవ్రమైన ఒత్తిడి బలహీనత మాత్రమే తనను ఇలాంటి పని చేసేలా చేశాయని తెలుపుతోంది.తన ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం తన తల్లితండ్రులే అంటూ తెలిపింది దీపికా పదుకొనే. ఇక తన భర్త రనవిర్ సింగ్ తో ప్రస్తుతం చాలా అన్యోన్యంగా ఉన్నట్లు తెలిపింది.