`హ‌లో బ్ర‌ద‌ర్‌` మూవీలో నాగార్జునకు డూప్ గా యాక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవ‌రో తెలిస్తే షాకైపోతారు!

టాలీవుడ్ కింగ్ నాగార్జున ద్విపాత్రాభిన‌యం చేసిన చిత్రాల్లో `హ‌లో బ్ర‌ద‌ర్‌` ఒక‌టి. ఇ.వి.వి. సత్యనారాయణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సౌంద‌ర్య‌, ర‌మ్య‌కృష్ణ హీరోయిన్లుగా న‌టించారు. శరత్ బాబు, గిరిబాబు, చరణ్ రాజ్, బాబుమోహన్, కోట శ్రీనివాసరావు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన‌ హ‌లో బ్ర‌ద‌ర్ మూవీ.. 1994లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది.

హాంకాంగ్ యాక్షన్ కామెడీ `ట్విన్ డ్రాగన్స్` ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. కామెడీ, మాస్ ఫైట్స్‌, హీరోయిన్స్ తో లవ్ ట్రాక్, రాజ్ కోటి సంగీతంలో రూపొందిన సాంగ్స్ హ‌లో బ్ర‌ద‌ర్ మూవీకి హైలెట్ గా నిలిచాయి. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ చిత్రం భారీ విజ‌యాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది.

అలాగే ఈ సినిమాలో నాగార్జున డబుల్ రోల్ చాలా బాగా ప్లే చేశారు. అయితే కొన్ని కొన్ని స‌న్నివేశాల్లో రెండు పాత్రలు తెర‌పై క‌నిపించాల్సి ఉంటుంది. ఆ టైమ్ లో నాగార్జున‌కు డూప్ గా టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో చేశాడు. ఆ హీరో మ‌రెవ‌రో కాదు శ్రీ‌కాంత్. కానీ ఈ విష‌యం చాలా మందికి తెలియదు. ఇవివి గారికి ప్రియమైన శిష్యుడు శ్రీకాంత్. కాబట్టి హ‌లో బ్ర‌ద‌ర్ లో నాగార్జున‌కు డూప్ గా చేయడానికి శ్రీ‌కాంత్ వెంటనే ఒప్పుకున్నాడు. గ‌తంలో శ్రీ‌కాంత్ స్వ‌యంగా ఈ విష‌యాన్ని రివీల్ చేశారు.