త్రిష – ప్రభాస్ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఆ స్టార్ హీరోనా..!?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్ వయసు ఇప్పటికే 40 దాటుతున్న ఇంకా పెళ్లి సంగతి ఎత్తడం లేదు. ఇక ఎప్పటికప్పుడు ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఏదో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే గతంలో ప్రభాస్ ఈవెంట్లో మాట్లాడుతూ తన పెళ్లి గురించి స్పందించాడు. నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పటివరకు ప్రభాస్ వివాహం చేసుకోలేదు.

ప్రభాస్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఓ స్టార్ హీరోయిన్ మోసం చేయడమేనంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఎవరు స్టార్ హీరోయిన్.. అనుకుంటున్నారా చెన్నై బ్యూటీ త్రిష. ప్రభాస్ – త్రిష కాంబినేషన్ టాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ కాంబినేషన్ గా చెప్పవచ్చు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. అయితే ప్రభాస్ – త్రిష వర్షం సినిమా షూటింగ్ టైంలో ఒకరినొకరు ప్రేమించుకున్నారని కానీ త్రిష అదే టైంలో రానా తో కూడా ప్రేమలో ఉందట.

రానా తో క్లోజ్ గా ఉంటూ తనతో బిహేవ్ చేసే విధానం ప్రభాస్ కు నచ్చక త్రిషను దూరం పెట్టాడట ప్ర‌భాస్‌. త్రిష – ప్రభాస్‌ను ప్రేమిస్తున్నట్లు చేసిన మోసాన్ని భరించలేక ఆమెకు బ్రేకప్ చెప్పాడట‌. ఇక త్రిష చేసిన మోసాన్ని భరించలేని ప్రభాస్ అదే తలుచుకుంటూ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదని న్యూస్ వైరల్ అవుతుంది. ఇలా పరోక్షంగా ప్రభాస్ – త్రిష ప్రేమ బ్రేకప్ అవ్వడానికి రానా కారణమయ్యాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అందరూ షాక్ అవుతున్నారు.