నీ సంగతి చెబుతా.. ఎన్టీఆర్‌కు వార్నింగ్ ఇచ్చిన అభిరామ్..

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు సినిమా ఇండస్ట్రీలో అందరి హీరోలతో సాన్నిహిత్యం ఉంటుంది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. అలాగే డైరెక్టర్లు, నిర్మాతలతో కూడా సన్నిహితంగా ఉంటారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా జూనియర్ ఎన్టీఆర్ ఎదగగా.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది ప్రేక్షకులముందుకు వస్తుందని భావించినా.. ఫ్యాన్స్ కు నిరాశై ఎదురైంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.

అయితే నవంబర్ 18న జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ సినిమా రీరిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లోని 400 థియేటర్లలో రీరిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఊరటనిచ్చే అంశం. అయితే ఎన్టీఆర్ గురించి దగ్గుబాటి హీరో అభిరామ్ పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. ఈ విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ మంచి డ్యాన్సర్ అని, ఆయన పర్పామెన్స్ కు హ్యాట్సప్ అని అభిరామ్ కామెంట్ చే శాడు. జూనియర్ ఎన్టీఆర్ తనకు మంచి ఫ్రెండ్ అని, కలిసినప్పుడు మంచిగా మాట్లాడుకుంటామని అభిరామ్ తెలిపాడు. చిన్నప్పుడు ఎన్టీఆర్ కు తాను వార్నింగ్ కూడా ఇచ్చానని అన్నాడు. సినిమాల్లోకి తాను వస్తానని, అప్పుడు నీ సంగతి చెబుతా అంటూ తారక్ కు చిన్నప్పుడు వార్నింగ్ ఇచ్చినట్లు అభిరామ్ చెప్పాడు. అప్పుడు అలా చెప్పడంతో ఎన్టీఆర్ ఇప్పుడు తనను ఎగతాళి చేస్తాడని ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పాడు. అరే భయమేస్తుంది.. నువ్వు ఇండస్ట్రీలోకి దిగావు.. నన్ను ఇంటికి పంపిచేస్తావు అంటూ ఇప్పుడు తారక్ తనను సరదాగా అంటాడని అభిరామ్ చెప్పాడు. అలాగే మహేష్ బాబుతో ఉన్న స్నేహం గురించి కూడా పలు విషయాలు చెప్పాడు.