RC -16 లో స్టార్ హీరోయిన్ కూతురు..!!

RRR చిత్రం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించిన రామ్ చరణ్ మంచి పాపులారిటీ సంపాదించారు. ఆ తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజెర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమాలో నటించబోతున్నారు రామ్ చరణ్. అయితే ఇందులో హీరోయిన్గా ఒక స్టార్ కిడ్ ను తీసుకోబోతున్నట్లు సమాచారం. హీరోయిన్ల విషయంలో ఎన్నో పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి.

RC 16: Ram Charan announces new film! "Telugu Movies, Music, Reviews and  Latest News"

అయితే ఇప్పుడు హీరోయిన్గా ఒక పేరు వినిపిస్తోంది ఆమె పేరు రషా తాడని.. ఈమె ఎవరో కాదు తెలుగులో పలు సినిమాలలో హీరోయిన్గా నటించిన కే జి ఎఫ్ -2 లో ప్రధానమంత్రిగా నటించిన బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కుమార్తె.. ఈమె భర్త కూడా బాలీవుడ్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గా పేరు సంపాదించారు నిర్మాత అనిల్ తడాని కాగా రామ్ చరణ్ , బుచ్చిబాబు సినిమా కోసం రషా తాడని ని లుక్ టెస్ట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లుక్ విషయంలో Rc -16 బృందం కాస్త సమ్మతంగానే ఉన్నట్లు సమాచారం.

యాక్టింగ్ పరంగా కూడా ఈమె ఓకే అన్నట్లుగా తెలుస్తోంది. దీంతో హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. రషా ఇప్పటికే బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తోంది అందులో స్టార్ హీరోలైన అజయ్ దేవగన్ ఫ్యామిలీకి చెందిన ఒక హీరోతో కూడా ఈమె నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి రామ్ చరణ్ అభిమానుల సైతం కాస్త ఆనందపడుతున్నారు. రషా తడాని విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.