ఇంట్రెస్టింగ్ : ఆ విషయంలో డుంకి రికార్డును క్రాస్ చేసిన సలార్..

పాన్ ఇండియ‌న్‌ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న మూవీ స‌లార్‌. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తర్కెక్కుతున్న ఈ సినిమా రెండు పార్ట్స్ గా రిలీజ్ అవుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించబడుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. రవి బసృర్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక డిసెంబర్ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కాబోతుంది.

భారీ పాన్ ఇండియా లెవెల్‌లో తరికెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ రోజునే బాలీవుడ్ భాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ డుంకి కూడా రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్యన పాన్ ఇండియా లెవెల్ లో భారీ కాంపిటీషన్ ఉంటుందని ప్రేక్షకులంతా భావిస్తున్నారు. ఈ రెండు సినిమాల బరిలో ఏది సక్సెస్ అందుకుంటుందో అనే ఆసక్తి కోట్లాదిమంది ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ విషయంలో సలార్ డుంకి రికార్డును బ్రేక్ చేసింది.

ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో లో సలార్ మూవీకి 357కే ఇంట్రెస్ట్లు రాగా.. షారుక్ డుంకి కి కేవలం 67కే ఇంట్రెస్ట్ లు మాత్రమే ద‌క్కాయి. ఇలా సలార్, డుంకీల విషయంలో సలార్‌కి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రేక్షకుల ఇంట్రెస్ట్ విషయంలో డుంకిని.. సలార్ సునాయాసంగా క్రాస్ చేసిందని చెప్పాలి. మరి రానున్న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానున్న రెండు సినిమాలలో రిలీజ్ అయిన తర్వాత ఏ సినిమా ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.