పల్లవి ప్రశాంత్ గురించి ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేసిన సోహెల్.. ఏమన్నాడంటే..?

బిగ్‌బాస్.. సోహెల్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రన‌ర‌ప్‌గా నిలిచిన సోహెల్ ఆ సీజన్ ఎండింగ్ లో కొత్త రికార్డును సృష్టించాడు. ఇక బిగ్ బాస్ సీజన్ పూర్తయిన తర్వాత ప‌లు మూవీల‌లో న‌టించిన సోహెల్‌ మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. సోహెల్ ప్రస్తుతం బూట్‌కట్ బాలరాజు సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాకి ఎమ్‌.డి షాషా నిర్మాత, మేగ‌లేఖ కథానాయక. సునీల్, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజై మంచి రెస్పాన్స్‌ తెచ్చుకుంది.

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సోహెల్ మాట్లాడుతూ బిగ్ బాస్ 7 గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేస్తాడు. బిగ్ బాస్ షోను రెగ్యులర్‌గా నేను చూడనని సోహెల్ చెప్పాడు. పల్లవి ప్రశాంత్ ను సోహెల్ మెచ్చుకున్నాడు. బిగ్ బాస్ షో లో ఉన్న కంటెస్టెంట్లు పట్ల ప్రశాంత్ ఎక్కడ కూడా దురుసుగా మాట్లాడలేదని.. వాడు పెద్దగా చదువుకోకపోయినా ఎక్కడా ఇతరుల పట్ల అగౌరవంగ ప్రవర్తించడం లేదంటూ చెప్పుకొచ్చాడు. అయితే నేను ఒక్కసారి మాత్రమే నా సోషల్ మీడియాలో ఫార్మర్ అని మాత్రమే మెసేజ్ చేశానని.. అందుకు నన్ను తిడుతూ వెంటనే ఎన్నో మెసేజ్లు వచ్చాయి. ఫాల్తూగా, లోఫర్, దొంగ, ఫ్యాట్ గాడు అంటూ గలీజ్ కామెంట్స్ చేశారని వివ‌రించాడు.

అసలు నేనేం తప్పు చేశాను.. ప్రశాంత్ తీరు నచ్చి ఆ మెసేజ్ మాత్రమే పెట్టాను వాళ్ళు చేసిన కామెంట్స్ కి నాకు చాలా కోపం వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు సోహెల్. దీంతో బిగ్ బాస్ గురించి ఎక్కడ మాట్లాడటం లేదని.. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఒక్కోసారి నేను కూడా ట్రిగ్గ‌ర్‌ అవుతాను. అప్పుడు నేను కూడా నాలుగు మాటలు అనవచ్చు అందువల్ల వాళ్లు కూడా బాధపడతారు ఎందుకు ఇవన్నీ అని నేను వాటికి దూరంగానే ఉంటున్న అంటూ చెప్పుకొచ్చాడు. తనకు అమర్దీప్ తో పాటు హౌస్ లో చాలామంది మంచి స్నేహితులు ఉన్నారని వారి పేరును చెప్పనందుకు బాధ కలగవచ్చు కానీ నేను ఏమీ చేయలేను అంటూ సోహెల్ చెప్పాడు.

సోహెల్ నటించిన లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాల ప్రమోషన్స్ కోసం ప్రశాంత్ చాలా కష్టపడ్డాడని సోహెల్ గుర్తు చేసుకున్నాడు. ఈ సినిమాల ప్రమోషన్స్ కోసం వాడు కనీసం నిద్రపోకుండా కష్టపడ్డాడు. నా రూమ్ వద్దకు వచ్చి వాడే ఆ సినిమా ప్రమోషన్స్ పనులను చూసుకున్నాడు అంటూ సోహెల్ చెప్పుకొచ్చాడు. దేనితో పల్లవి ప్రశాంత్ ఇమేజ్ మరింతగా పెరిగింది. సోహెల్ అంత బాగా తెలిసిన సరే పల్లవి ప్రశాంత్ ఎప్పుడు హౌస్ లో సోహెల్ ఇమేజ్‌ను వాడుకొని ఓట్లు దక్కించుకోవాలని ప్రయత్నం చేయలేదు. దట్ ఇజ్‌ ప్రశాంత్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెట్టిజన్లు.