అందం కూడా అసూయపడేలా ఆకట్టుకుంటున్న పూర్ణ.. ఫొటోస్ వైరల్..!

ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు పెళ్లయి పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మరింత గ్లామర్ డోస్ పెంచేసి.. అందరిని ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ నటి పూర్ణ కూడా తల్లి అయిన తర్వాత కొన్నాళ్లు గ్లామర్ ఫోటోషూట్ కి దూరంగా ఉంది. అయితే ఇప్పుడు మళ్లీ తిరిగి బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ ని తన అందాలతో ఆకట్టుకుంటుంది. తాజాగా చుడీదార్ ధరించి తన అందాలతో కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఈమె అందాలను ఆస్వాదించడానికి రెండు కళ్ళు సరిపోవు అని చెప్పడంలో సందేహం లేదు. నిండైన దుస్తుల్లో చందమామలా మెరుస్తూ తన అందంతో మరొకసారి మెస్మరైజ్ చేసింది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్న ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మగ బిడ్డకు జన్మనిచ్చిన ఈమె దుబాయ్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రసవించారు. తర్వాత సినిమాలకి, సోషల్ మీడియాకి కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్లీ బిజీ అయిపోయారు. ఇటీవలే నాని దసరా సినిమాలో విలన్ భార్యగా ఇంటెన్స్ రోల్ ప్లే చేసిన పూర్ణ ఢీ సీజన్ 16 లో జడ్జిగా కూడా వ్యవహరించారు.

అలాగే పలు చిత్రాలలో కీలక పాత్రలో పోషిస్తున్న ఈమె అవకాశం దొరికితే .. పాత్ర నచ్చితే కచ్చితంగా సినిమాలలో నటిస్తాను అని చెబుతోంది.ఇకపోతే భర్త అనుమతితోనే వివాహం అనంతరం ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈమె బుల్లితెరపై అలాగే సిల్వర్ స్క్రీన్ పై కూడా సందడి చేయడానికి సిద్ధమయ్యింది. ఇకపోతే పూర్ణ కెరియర్ విషయానికి వస్తే.. హీరోయిన్ గా సీమటపాకాయ్ , అవును లాంటి చిత్రాలు ఈమెకు మంచి విజయాలను అందించాయి. ఇకపై ఈమెకు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.