ఆ హీరోయిన్ల బాటలో అక్కినేని అఖిల్.. సర్జరీ తో షాక్ ఇస్తూ..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాగార్జున వారసుడిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. అయితే సినిమాల పరంగా ఈయనకు సక్సెస్ మాత్రం లభించలేదు. ఎంతో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన అఖిల్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఒక ఛాలెంజింగ్ గా మారిపోయింది. ముఖ్యంగా నాగార్జున ఎంత సపోర్టు ఇచ్చినా సరే అఖిల్ మాత్రం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోతున్నారు.

అయితే అక్కినేని అఖిల్ ఈ మధ్యకాలంలో ఏజెంట్ సినిమాతో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందు వచ్చి డిజాస్టర్ సినిమాని మూటగట్టుకున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. అఖిల్ కి సంబంధించి ఒక విషయం వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం ఆయన హీరోయిన్లను ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది .అయితే ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం అని చెబుతున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. వాస్తవానికి చాలామంది హీరోయిన్లు సినిమాలలో అవకాశాలు రావడం కోసం తమ శరీరాన్ని, ముఖాన్ని సర్జరీలతో అందంగా మార్చుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు హీరోయిన్ల బాటలోనే అక్కినేని అఖిల్ కూడా అందం కోసం ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

 

వాస్తవానికి అఖిల్ ముఖ ఛాయ బాగానే ఉన్నప్పటికీ కూడా ఆయన ముఖంలో ముక్కు బాగుండదట. అయితే ఈ ముక్కు కరెక్ట్ గా లేకపోవడం వల్లే తన ఫేసులో ఎన్ని ఎక్స్ప్రెషన్స్ బయటపెట్టిన కూడా ప్రేక్షకులకు అవి సరిగా కనిపించడం లేదని , అందుకే విదేశాలకు వెళ్లి మరీ ముక్కుకు సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం ఇప్పుడు చాలా వైరల్ గా మారుతోంది.