మెగాస్టార్ 157వ‌ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తన కెరీర్ 157వ మూవీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇటీవల అనౌన్స్ మెంట్ వచ్చిన ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడిగా ముగ్గురు హీరోయిన్స్ నటించే ఛాన్స్ ఉందట. అలాగే దీనిని సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ గా మెగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునేలా దర్శకుడు వశిష్ఠ రూపొందించనున్నాడట.

యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాని ప్రకారం ఇటీవల మోకాలికి మైనర్ సర్జరీ చేపించుకున్న మెగాస్టార్.. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారని.. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి 157వ సినిమా షూటింగ్ మొదలెట్టేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది.

అలాగే అక్కడి నుంచి ఏప్రిల్ చివరి వారం వరకు నాన్ స్టాప్ గా షూటింగ్ పూర్తి చేసి అనంతరం ఆరు నెలల పాటు విఎఫ్ వర్క్ నిర్వహించనున్నట్లు సమాచారం. అలాగే ఈ మూవీని 2025 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి తీసుకురావాలనేది మేకర్స్ ప్లాన్ అట. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో ఒక్కోక్కటిగా వెల్లడి కానున్నాయి.