పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ లహరి… సైడ్ యాంగిల్ లో దుమ్ము లేపింది!

బిగ్ బాస్ లహరిని ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఎలాగన్నా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ కావాలని కలలుగని వచ్చిన లహరికి ఇక్కడ పెద్దగా బ్రేక్ రాలేదనే చెప్పుకోవాలి. దీంతో ఆమె చిన్న చితకా పాత్రలు చేస్తూ జీవితం నెట్టుకొస్తోంది. మన టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలు రాణించడం అంత ఈజీ కాదు. కనీసం టూ టైర్ హీరోలు కూడా ఇక్కడ లోకల్ టాలెంట్ ని ప్రోత్సహించే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే లహరి బిగ్ బాస్ సీజన్ 5తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 19 మంది కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఎంట్రీ ఇచ్చిన లహరి హౌస్ లో ప్రభావం చూపలేకపోయినప్పటికీ ఆమె కట్టిపడేసే గ్లామర్, టాలెంట్ సగటు ప్రేక్షకులని అలరించాయి.

అయితే అందులో కొన్ని వివాదాలు కూడా ఆమె ఎలిమినేట్ కావడానికి కారణం అయ్యాయి. బిగ్ బాస్ హౌస్లో లహరి క్యారెక్టర్ పై యాంకర్ రవి ఆరోపణలు చేయడం నుండి అది మొదలయ్యింది. హౌస్ లో సింగిల్ మెన్ చాలా మంది ఉండగా లహరి నా వెంటపడుతుందని రవి తనతో అన్నట్లు కంటెస్టెంట్ ప్రియ ఓపెన్ కాగా ఆ విషయం అప్పట్లో పెద్ద రాద్దాంతం అయింది. ఈ విషయంలో రవి నటి ప్రియ పై ఫైర్ అయ్యారు కూడా. సరిగ్గా అదే సమయంలో రవి, లహరి బాత్రూమ్ ఏరియాలో మిడ్ నైట్ హగ్ చేసుకోవడం చూశానని ప్రియ చెప్పడంతో ఈ గొడవ మరింత పెద్దదైంది. ఇక రవితో లహరి రొమాన్స్ సంగతి ఎలా ఉన్నా… లహరి గురించి రవి తప్పుగా మాట్లాడినట్లు రుజువు కావడంతో ప్రియ బండారం మొత్తం బయటపడింది. అయితే ఏది ఏమైనా ఈ వివాదంలో నష్టపోయింది మాత్రం లహరినే.

ఇకపోతే తరువాత కొన్ని పరిణామాల తరువాత హౌస్ నుండి బయటకు వచ్చాక లహరి ఫేమ్ కొంచెం పెరిగిందనే చెప్పుకోవాలి. గతంతో పోల్చితే ఎంతో కొంత గుర్తింపు రాబట్టింది. కెరీర్ మరీ అంత ఆశాజనకంగా లేకపోయినప్పటికీ లహరి వచ్చిన ఆఫర్స్ కాదనకుండా చేస్తూ పోతున్నారు. ఇక ఫ్యాన్స్ కి చేరువ కావడానికి సోషల్ మీడియా వేదికగా ఆమె గతంలో కంటే ఇపుడు చాలా యాక్టివ్ గా వుంటోంది. ఈ క్రమంలో వరుస ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. తాజాగా లహరి ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి. తన హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్ళకు మెంటల్ తెప్పిస్తుంది. డెనిమ్ షార్ట్ లో థండర్ థైస్ కనిపించేలా బోల్డ్నెస్ కి తెరలేపింది. కావాలంటే ఇక్కడ చూడండి.