కొత్తగా లంగా ఓణీలో మెరిసిన యాంకర్ సుమ… వేదిక ఇదే!

యాంకర్ సుమ గురించి తెలియని తెలుగు ప్రజలు దాదాపుగా వుండరు. ఆమె ఒక సినిమా హీరోయిన్ కాకపోయినప్పటికీ వారికంటే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కేవలం యాంకరింగ్ చేస్తూనే ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించింది. కేవలం ఒక యాంకరింగ్ ఫీల్డ్ లో పనిచేస్తూ ఆ స్థాయికి వెల్లడమంటే సాధారణమైన విషయం కాదు. అది కేవలం సుమగారికే చెల్లింది. బేసిగా మలయాళీ కుట్టి అయినటువంటి సుమ కేవలం తన వాగ్ధాటితో తెలుగునాట తిష్ట వేయడం అంటే సాధారణమైన విషయం కాదు. సుమ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఆమెకి సంబందించినటువంటి పలు రకాల ఫోటోలు వైరల్ కావడం మనం గమనించవచ్చు.

అవును, సుమ కనకాల ఇపుడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ కి తనలోని తెలియని మరో కోణం పరిచయం చేస్తుంది. తాజాగా ఆమె లంగా ఓణీలో ఆకట్టుకున్నారు. బుల్లితెర మీద యాంకర్ గా చెరగని ముద్ర వేసిన సుమ ఆమధ్య ‘జయమ్మ పంచాయితీ’ సినిమా ద్వారా ఆర్టిస్టుగా కూడా మారారు. ఆమె ఘన చరిత్ర ఎవరు అందుకోలేనిది. ఆమె సై అంటే నిర్మాతలు పలు షోలను ఆమె సారథ్యంలో నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారు అంటే అర్ధం చేసుకోండి ఇక. అయితే ఏళ్ళ తరబడి ఒకే పని చేయడంతో బోర్ కొట్టిందేమో కానీ సుమ షోలు తగ్గించింది. ప్రస్తుతం సుమ అడ్డా, అమ్మ ఆవకాయ్ వంటి రెండు షోలు మాత్రమే చేసింది.

కాగా 1996లో నటిగా సుమ దాసరి దర్శకత్వంలో కళ్యాణ ప్రాప్తిరస్తు చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఆ తరువాత రెండు మూడు మలయాళ చిత్రాల్లో హీరోయిన్ గా చేశారు. కానీ బ్రేక్ రాకపోవడంతో యాంకర్ అవతారం ఎత్తారు. అది బాగా కలిసొచ్చింది. ఈ రంగంలో తిరుగులేని ఆధిపత్యం సాధించారు. ఈ క్రమంలో గత పాతికేళ్లుగా సుమ స్టార్ యాంకర్ హోదాలో కొనసాగుతున్నారు. సుమ షోలో ఉన్నారంటే వినోదం పరుగులు పెడుతుంది అనడానికి ఆమె షోలే నిదర్శనం. ఆమె టైమింగ్ పంచ్లు షోకి హైలెట్ గా నిలుస్తాయి అని అందరూ అంటూ వుంటారు. అందుకే దశాబ్దాలుగా ఆమె ప్రస్థానం సాగుతుంది. అంతేకాదు, ఆమె నాలుగైదు భాషలు సుమ అనర్గళంగా మాట్లాడుతుంది. కాగా సుమ రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకుందనే విషయం అందరికీ విదితమే.