బిగ్ బాస్ 7లో ఎలిమినేట్ అయిన నయని పావని రెమ్యునరేషన్ ఎంత తెలుసా..?

బిగ్ బాస్ 7వ సీజన్ నుంచి ఆరో వారం ఊహించని కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయింది. వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ తో హౌస్ లోకి అడుగుపెట్టిన‌ ముద్దుగుమ్మ నయని పావని వచ్చిన వారంలో తన ఆటతో ఆకట్టుకుంది. కానీ అనుకోని విధంగా బయటకొవచ్చేసింది. మరి ఈ వారంలో ఆమె ఎంత సంపాదించుకుందో తెలుసా. బిగ్ బాస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పలేం. నామినేషన్స్ నుంచి ఎలిమినేషన్స్ వరకు కొన్నిసార్లు మనం ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. అలా ఈ వారం ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు.

రెండు రోజులు ముందు వరకు ఓటింగ్ పరంగా చూసుకుంటే శోభా శెట్టి, పూజ మూర్తి, నయని పావని చివరి స్థానంలో ఉన్నారు. వీళ్లల్లో చాలామంది శోభా శెట్టి లేదా పూజ మూర్తి ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు. కానీ వీళ్ళిద్దరూ కాకుండా నయని పావని ఎలిమినేట్ అయిపోయింది. అయితే గేమ్, టాస్కుల పరంగా ఆమెకి బలం ఉంది. ఇంకో రెండు మూడు వారాలు ఉండుంటే రేసులో ఉండేదేమో. కానీ పరిస్థితులు అనుకూలించక.. వచ్చిన మొదటి వారంలోని ఎలిమినేట్ అయిపోయింది.

ఇకపోతే వారానికి రూ. 2 లక్షలకు నయని పావని అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అంటే వచ్చిన వారం మాత్రమే ఉంది కాబట్టి కేవలం రూ. 2 లక్షలు తీసుకునే ఇంటికి వెళ్ళిపోయింది. మరోవైపు ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసిన శుభశ్రీ, హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చింది.