నాగార్జున పై సంచలన కామెంట్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ సందీప్ భార్య…!!

స్టార్ మా ఛానల్ లో ప్రచారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 ప్రస్తుతం రికార్డ్ స్థాయి టిఆర్పి రేటింగ్స్ తో దూసుకుపోతుంది. అయితే హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లలో ఫస్ట్ నుంచి స్ట్రాంగ్ గా అనిపించినా.. టాప్-3 లో ఒకరు సందీప్. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సందీప్ యాక్టింగ్ చేస్తున్నాడంటూ నెట్టింట నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.

అలాగే ప్రతి వీక్ నాగార్జునతో క్లాస్ తీసుకునే ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్లలో సందీప్ తప్పకుండా ఉంటాడు. అయితే సంచాలక్ గా విఫలం అయినప్పుడు నాగ్.. సందీప్ ను.. చెత్త సంచాలక్, నువ్వు పెద్ద పిస్తా అనుకుంటున్నావా? అన్న మాటలకు తాజాగా సందీప్ భార్య జ్యోతి స్పందించింది. ” నాగార్జున ఏ రేంజ్ వ్యక్తో నాకు తెలుసు. అయినా నా భర్తను అన్ని మాటలు అనేస్తాడా? నా భర్త నాకు గొప్ప, అలా తక్కువ చేసి మాట్లాడటం సరైన పద్ధతి కాదు అనిపించింది.

కానీ ఒక్కసారి నాగార్జున గారు బోనులోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన ఏది చెప్తే అదే చేయాలి. ఎన్ని మాటలు అన్నా కూడా పడాలి తప్పదు. సందీప్ ను తిట్టిన ఆయనే మళ్లీ అతడ్ని మెచ్చుకున్నాడు. పరిశ్రమలో తిట్లు తిట్టించుకోవడం కామన్. ఇక అన్ని భరించాలి. అప్పుడే గొప్ప స్థాయికి వస్తాం ” అంటూ సందీప్ భార్య చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.