అల్లు అర్జున్ తాగే బ్రాండ్ పేరు పబ్లిక్ లో చెప్పేసిన స్నేహారెడ్డి.. అదేంటో తెలుసా..!

పుష్ప ది రైజ్ సినిమాతో దేశవ్యాప్తంగా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్‌తో ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. అయితే అల్లు అర్జున్‌కి హీరోగా అభిమానుల్లో ఎంత ఫాన్ ఫాలోయింగ్ ఉందో ఆయన భార్య స్నేహ రెడ్డికి సైతం సోషల్ మీడియాలో అంతే ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో స్నేహారెడ్డి పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది.

ఇక వీరిద్దరూ ఓవైపు ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ తో తీరిక లేకుండా ఉంటూనే సమయం దొరికితే వెకేషన్‌కు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. లండన్ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలు బన్నీ, స్నేహారెడ్డి లు సోష‌ల్ మీడియాలో షేర్ చేయగా అవి బాగా వైరల్ అయ్యాయి. తాజాగా స్నేహ రెడ్డి తన ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. తను ప్రేమలో ఉన్న.. లేకపోయినా కూడా శాంపైవ్ తగుతాను అని పో కొటేషన్ ఉంది. ఆ కొటేషన్ ను స్నేహ రెడ్డి షేర్ చేసింది. అంటే తను కూడా అలానే శాంపైన్ తాగుతానని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం స్నేహ రెడ్డి తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన ఈ కొటేషన్ మాత్రం తెగ వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ జరుగుతున్నట్లు ఫిలింనగర్ సర్కిల్ టాక్. యాక్షన్ ఎంటర్ గా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సీక్వెల్ పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించనుంది.