ఆ స్టార్ హీరోయిన్ కి డూపుగా నటించిన నటి హేమ.. ఎవరికంటే..?

సాధారణంగా సిని ఇండస్ట్రీలో ఉండే నటీనటులు అందరికీ కూడా డుప్స్ ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే.. అన్ని సన్నివేశాలలో కూడా హీరోయిన్స్ నటించడం చాలా కష్టతరమని చెప్పవచ్చు.. కానీ కష్టతరమైనటువంటి సన్నివేశాలలో వీరికి బదులుగా అచ్చం వారి పోలికలతో ఉన్నటువంటి వారు నటిస్తూ ఉంటారు. ఏదైనా యాక్షన్ సన్నివేశాలలో నటించడానికి హీరోలు ముందుకు రాకపోవడంతో వారి డూప్స్ ఎక్కువగా నటిస్తూ ఉంటారు.

ఇలా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్స్ డుప్స్ చాలామంది ఉన్నారు. దివంగత నటి శ్రీదేవి తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. తెలుగు భాషలోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ హిందీ వంటి భాషలలో కూడా నటించి మంచి క్రియేట్ అందుకున్నది. ఇలా ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొనసాగిన ఈమె అగ్ర హీరోలు అందరితో నటించింది. కానీ శ్రీదేవి అకాల మరణం అందరిని ఎంతగానో దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే శ్రీదేవి నటవారసురాలుగా ఆమె కూతురు జాన్వీ కపూర్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

నటనపరంగా ఎన్నో సన్నివేశాలలో ఛాలెంజ్ తీసుకొని శ్రీదేవి కూడా చాలా సన్నివేశాలలో డుపు సహాయం లేకుండా నటించింది. జగదేకవీరుడు అతిలోకసుందరి ఇలాంటి సినిమాలు నటించి తను సంచలన విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో శ్రీదేవి పాత్రలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించినటువంటి హేమ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అయితే ఏ సన్నివేశంలో శ్రీదేవి బదులుగా హేమ నటించిన విషయానికి వస్తే.. ఈ సినిమాలో దివి నుంచి కిందికి దిగి వస్తున్న సమయంలో నీళ్లలో దిగి ఇదే సన్నివేశంలో హేమ నటించింది..శ్రీదేవికి ఈత రాకపోవడంతో ఈ సన్నివేశంలో తాను నటించానని తెలియజేసింది. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.