యాక్టర్ సుహాస్ కొత్త మూవీ టీజర్..!!

ఒకపక్క సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేస్తూనే మరపక్క హీరోగా కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు నటుడు సుహాస్.. మొదట కలర్ ఫోటో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సుహాస్ ఆ తర్వాత రైటర్ పద్మభూషణం సినిమాతో కూడా మరొకసారి మంచి విజయాన్ని అందుకున్నారు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇటీవల ఏకంగా తను నటించబోతున్న 6 సినిమాలను సైతం అనౌన్స్మెంట్ చేసినట్లుగా తెలుస్తోంది.

అందులో ఒకటి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్.. ఈ సినిమా టైటిల్ ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్లను చూస్తే ఇది ఒక కామెడీ ఎమోషనల్ సినిమాగా తెరకెక్కించడం జరుగుతోంది .అయితే ఈ చిత్రాన్ని రూరల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. లవ్ స్టోరీస్ తో స్టార్ట్ అయిన టీజర్.. ఇంట్లోనైనా ఆడపిల్లలు పుడితే భారం అనుకునే అంశాన్ని అలాగే జాతి భేదం అనే అంశాలను కూడా చూపించడం జరిగింది. గత సినిమాలలో గానే చాలా సాఫ్టుగా ఫ్యామిలీ హీరోగా కనిపించిన సుహాస్..

 

అయితే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో మాత్రం కాస్త యాక్షన్స్ సన్నివేషాలతో తనలోని మాస్ ని సైతం బయట పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి టీజర్ అయితే ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉన్నది. ఈ చిత్రాన్ని దుష్యంత్ డైరెక్టర్ చేస్తున్నారు. ఈ సినిమా బన్నీ వాసు నిర్మిస్తూ ఉన్నారు. అలాగే ఇందులో శివాని హీరోయిన్గా నటిస్తున్నదా ఫిదా ఫేమస్ శరణ్య ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నది. ఈ చిత్రానికి మ్యూజిక్ శేఖర్ చంద్ర అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కు సంబంధించి ఈ టీజర్ వైరల్ గా మారుతోంది.