పెళ్లి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన వైష్ణవి చైతన్య….!!

సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా వైష్ణవి చైతన్య పేరే మారుమోగుతుంది. ఇన్‌స్టా రీల్స్, టిక్ టాక్ వీడియోలతో పాపులారిటీ సంపాదించుకుంది వైష్ణ‌వి. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురంలో బన్నీకి చెల్లిగా నటించి అందరిని మెప్పించింది.

ఈ మధ్యకాలంలో విడుదలైన బేబీ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. బేబీతో వైష్ణవి క్రేజ్ ఓ రేంజ్‌కి వెళ్ళింది. తాజాగా వైష్ణవి చైతన్య అభిమానులతో కాసేపు ముచ్చటించింది. ‘వాట్సాప్ బేబీ’ పేరుతో వైష్ణవి వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో నెటిజెన్లు అడిగే ప్రశ్నలకు సమాధానమిచ్చింది.

పెళ్లి గురించి ఓ నెటిజన్ ఆసక్తికర ప్రశ్న అడిగాడు. దానికి సమాధానం చెప్తూ‌‌.. మన జీవితంలోకి వచ్చే వారు నువ్వు ఇలా చేయాలి.. అలా చేయకూడదు అనే కండిషన్లు పెట్టకూడదంటూ వైష్ణవి చెప్పుకొచ్చింది. ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.