నిహారిక లైఫ్ లో వీళ్ళకే ఇంపార్టెన్స్..సింపుల్ గా చెప్పేసింది!

మెగా ఫ్యామిలిలో నిహారిక గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టీవీ షోల్లో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత రెండు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. అయితే ఈ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఆ తరువాత నిహారిక సినిమాల్లో కనిపించలేదు. ఇక గత కొన్ని రోజుల నుంచి ఇండస్ట్రీలో నిహారిక హాట్ టాపిక్ అయ్యింది. నిహారిక చైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత ఎక్కడ చూసిన వీరి గురించే మాట్లాడుకుంటున్నారు. నిహారిక చైతన్య వివాహం ఎంత గ్రాండ్ గా జరిగిందో అందరికి తెలిసిందే. అయితే పెళ్ళైన కొన్ని నెలల్లోనే వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలు విడాకులు తీసుకునేంత దూరం వెళ్లాయి. దీంతో వీరు విడాకులు తీసుకుంటున్నట్టు అధికారికంగా కూడా ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె గురించి ఎదో ఒక టాపిక్ నడుస్తోంది.

అయితే తాజాగా నిహారిక లైఫ్ లో వీళ్ళకే ఇంపార్టెన్స్ అన్నట్టు ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా జరిగిన రాఖీ పండుగని మెగా ఫ్యామిలి సంతోషంగా జరుపుకున్నారు. నిహారిక కూడా వాళ్ల అన్నలకు రాఖీ కట్టింది. ఈ ఫోటోలను, వీడియోలను నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. తన అన్నయ్యలు రామ్ చరణ్, వరుణ్ తేజ్లతో పాటు మరో అన్నయ్యకు కూడా రాఖీ కట్టింది నిహారిక. ఆ వీడియోకి ఈ రాఖీ పండుగ నాకు చాలా స్పెషల్.. ఒక అన్నయ్య త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు, ఇంకో అన్నయ్య ఈ మధ్యే తండ్రయ్యాడు, మరో అన్న ఐదేళ్ల తర్వాత ఈ మధ్యే ఇండియాకి వచ్చాడు. ఆల్ లవ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నిహారిక షేర్ చేసిన ఈ వీడియో కొన్ని క్షణాల్లోనే వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ గా కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోలో నిహారిక అన్న వాళ్ళని ఆట పట్టించి, దీవెనెలు తీసుకుంది. మీరు కూడా ఈ వీడియోని చూసేయండి.