ఈసారి బిగ్‌బాస్ టైటిల్ దక్కేది అతడికేనా.. బాగా హైలెట్ అవుతున్నాడు గా..

సీరియల్ నటుడు అమర్ దీప్ గురించి తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అమర్ దీప్ 2017 లో ‘ఉయ్యాలా జంపాల’ అనే సీరియల్ ద్వారా బుల్లితెర పై అడుగుపెట్టాడు. ఆ తరువాత సిరి సిరి మువ్వలు అనే సీరియల్ లో నటించాడు. ఇక ప్రియాంక జైన్ తో కలిసి నటించిన ‘జానకి కలగనలేదు’ సీరియల్ తో తెలుగు లో బాగా పాపులర్ అయ్యి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అమర్ దీప్. ఈ సీరియల్ తో పాటే రీల్స్ చేస్తూ,యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ సోషల్ మీడియాకు దగ్గరయ్యి బిగ్ బాస్ సీజన్ 7 లోకి వెళ్లే ఛాన్స్ ను అందుకున్నాడు. ఇక అమర్ దీప్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టడంతోనే అతనికి ఫ్యాన్ పేజీలు రెడీ అయిపోయాయి.

బిగ్ బాస్ మొదలై ఒక వారం పూర్తిచేసుకొని రెండవ వారం లోకి అడుగుపెట్టింది. మొదటి వారం ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది కిరణ్ రాథోడ్ హౌస్ నుండి బయటకి వెళ్ళిపోయింది. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంతో ఉత్సాహంతో వెళ్లిన అమర్ ఒక్కసారిగా నీరుగారిపోయాడు. హౌస్ లో యాక్టీవ్ గా ఉండటం లేదు, గేమ్స్ లో అంతంత మాత్రంగానే ప్రయత్నిస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే అతని అభిమానులను నిరాశపరిచాడు అని చెప్పాలి. వీకెండ్ లో నాగార్జున కూడా అదే చెప్పుకొచ్చాడు. దాంతో ఇకనుంచి యాక్టివ్ గా ఉంటాను అని నాగార్జున తో చెప్పుకొచ్చాడు అమర్ . ఇక చెప్పినట్లుగానే అమర్ దీప్ ఈ వారం రంగంలోకి దిగాడు. గతరాత్రి జరిగిన నామినేషన్ లో ఏదైనా హైలైట్ ఉంది అంటే అది అమర్ దీప్- పల్లవి ప్రశాంత్ ల నామినేషన్ అనే చెప్పాలి.

పల్లవి ప్రశాంత్ ను ఒక రేంజ్ లో దులిపిపారెసాడు అమర్. ప్రతిసారి రైతుబిడ్డ అని చెప్తూ సింపతీ సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నాడని,అతనిలానే మేము కూడా వచ్చామని ఫైర్ అయ్యాడు. అంతేకాకుండా ప్రశాంత్ కు రెండు ముఖాలు ఉన్నాయని, దమ్ముంటే రైతుబిడ్డ అనే పదం లేకుండా గేమ్ ఆడమని చెప్పుకొచ్చాడు అమర్. అలానే బీటెక్ స్టూడెంట్స్ కష్టాల గురించి, సీరియల్ ఆర్టిస్టుల కష్టాల గురించి ఓ రేంజ్ లో స్పీచ్ ఇచ్చి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. మొదటి వారంవరకూ సైలెంట్ గా ఉన్న అమర్ ఒకే ఒక్క నామినేషన్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచాడు. ఈ నామినేషన్ తరువాత అమర్ దీప్ గేమ్ మారుతుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరీ అమర్ దీప్ ఆ ఫైర్ ని అలానే కంటిన్యూ చేస్తాడా లేదా అనేది చూడాలి.