గుట్టుచప్పుడుగా రెండో పెళ్లి చేసుకుంటున్న నాగచైతన్య.. అమ్మాయి ఎవరంటే..?

అక్కినేని హీరో నాగచైతన్య – సమంత ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఏవో మనస్పార్ధాలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం ఇద్దరూ ఎవరి కెరీర్ వారు చూసుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

అయితే నాగచైతన్య శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నారని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని అటు శోభిత ధూళిపాల ఇటు నాగచైతన్య కొట్టి పారేశారు. ఈ క్రమంలో నాగచైతన్య సైలెంట్ గా రెండో పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. నాగచైతన్య బడా బిజినెస్ మాన్ కూతురిని పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్.

ఇక ఈ బిజినెస్ మాన్ ఫ్యామిలీ కూడా అక్కినేని వారికి దూరపు బంధువులని.. నాగచైతన్య కి మొదట పెళ్లి అయిందని తెలిసి కూడా ఆ అమ్మాయి నాగచైతన్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.