పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న హిట్ సినిమాలు ఇవే..!!

తెలుగు ప్రేక్షకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు ఎంతలా ఊగిపోతారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు… పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తీసే సినిమాలు సైతం రికార్డులతో బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాలను సృష్టిస్తూ ఉంటాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ 52వ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఉన్నటువంటి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

Advance happy birthday pawan kalyan | Advance happy birthday, Pavan kalyan  birthday hd images, Birthday images hd

పవన్ కళ్యాణ్ తన 27 ఏళ్ల సినీ కెరియర్ల 28 సినిమాలలో నటించారు.. ఇక ఈ రోజున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాల గురించి తెలుసుకుందాం.. పవన్ కళ్యాణ్ కెరియర్ లో వదిలేసిన సినిమాలలో అతడు, పోకిరి, నువ్వే కావాలి, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఇడియట్, విక్రమార్కుడు వంటి చిత్రాలు మొదట పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చాయట అయితే కొన్ని కారణాల చేత పవన్ కళ్యాణ్ ఈ సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందట.

అయితే ఈ సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ సినిమాలు కావడం విశేషము. ఈ చిత్రాల్లో నటించిన స్టార్ హీరోలు సైతం పలు రికార్డులను సృష్టించడం కూడా జరిగింది. రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అక్కడ కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు అభిమానులు తనని సీఎంగా చూడాలని కోరుకుంటున్నప్పటికీ తను మాత్రం ఇతర పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు.. సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం OG, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాల షూటింగ్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.