ఎన్టీఆర్ ని పెళ్లి చేసుకోవాలనుకున్న స్టార్ హీరోయిన్..అడ్డుపడింది ఎవరంటే..?

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన జూనియర్ ఎన్టీఆర్ మంచి క్రేజ్ ను అందుకున్నారు.. గతంలో ఎన్టీఆర్ ని చాలా మంది సైతం ఎక్కువగా విమర్శించేవారు.. ఆ విమర్శల నుంచి ప్రశంసలు సైతం అందుకున్న ఎన్టీఆర్ ఎటువంటి రూమర్లకు తావు ఇవ్వలేదు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక హీరోయిన్ ఎన్టీఆర్ ని వివాహం చేసుకోవాలనుకున్నదట.ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ గజాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన కెరియర్ లో ఎన్నో విజయాలను అందుకున్న ఈమె ఎన్టీఆర్ తో కలిసి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో నటించింది. రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తో హీరోయిన్ గజాల ప్రేమలో పడిందట. అయితే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నదట. ఎన్టీఆర్ ను గజాల ప్రేమిస్తున్న విషయం చిత్ర యూనిట్ లో కొంతమంది మాట్లాడుకోగా ఆ విషయం ఎన్టీఆర్ చెవిన పడిందట.

 

ఆ వెంటనే ఎన్టీఆర్ ఈ విషయంపై ఆమెతో మాట్లాడక నేను ఇప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చాను పెళ్లికి ఇంకా చాలా సంవత్సరాలు సమయం పడుతుంది.. అంతేకాకుండా తన పెళ్లి విషయంలో పూర్తి బాధ్యత అంతా కూడా తన తల్లిదండ్రులదే అంటూ సున్నితంగా ఆమెను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.. అప్పట్లో గజాల వ్యవహారం చాలా వైరల్ గా మారింది. అయితే ఎన్టీఆర్ ని పెళ్లి చేసుకోవాలని కోరిక అప్పట్లో ఈమెకు చాలా బలంగా ఉండేదట.. కానీ చివరికి ఎన్టీఆర్ అలా చెప్పడంతో ఈమె సైలెంట్ అయినట్లు సమాచారం.