గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తారకరత్న హీరోయిన్..!!

తెలుగు ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ సైతం ఎంట్రీ ఇస్తూ ఉంటారు.. అయితే కొంతమంది మాత్రమే కొన్ని సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంటారు. అలాంటి వారిలో కర్ణాటక ప్రాంతానికి చెందిన రేఖ వేదవ్యాస్ కూడా ఒకరు. 2001లో ఆనందం సినిమాతో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఈమె తన క్యూట్ అందాలతో మైమరిపించింది. హీరోగా ఆకాష్ నటించారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వం వహించడం గమనార్హం.

ఆ తర్వాత తారకరత్న నటించిన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాలో కూడా నటించింది రేఖ వేద వ్యాస్.. ఈ సినిమా కూడా బాగానే ఆకట్టుకుంది.ఆ తరువాత జానకి వెడ్స్ శ్రీరామ్ లో కూడా నటించింది. అలా అడపాదడపా సినిమాలలో నటించిన రేఖ పెద్దగా సక్సెస్ లు రాకపోవడంతో కన్నడ ఇండస్ట్రీకే పరిమితమైంది. కన్నడలో మాత్రం వరుసగా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా పాపులారిటీ అందుకుంది.. 2008లో చివరిగా నిన్న నేడు రేపు అనే సినిమాలో నటించింది దాదాపుగా 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కనిపిస్తోంది.

 

గడచిన కొద్ది రోజుల క్రితం ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న ఈమె మళ్లీ తెలుగులో రీఎంట్రీ ఇవ్వాలనుకున్నట్లు తెలియజేసింది. ఇమేను చూసిన పలువురు నేటిజన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. చాలా బొద్దుగా మారిపోయి అందరిని ఆశ్చర్యానికి కలిగిస్తోంది. కనిపించకుండా పోయిన ఒక్కసారిగా ఇలా ప్రత్యక్షం అవ్వడం జరిగింది. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఎంట్రీ ఇచ్చింది. ఒక్కసారిగా అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. చూడడానికి చాలా సన్నగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అయితే ఆమె ఏదో అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా తెలియజేయబోతున్న సందర్భంలో ఈ ప్రోమో క్లోజ్ అవుతుంది. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారుతోంది.