వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్.. అదేంటంటే….!!

వాట్సాప్ మరో కొత్త ఫ్యూచర్ ప్రకటించింది. ఛానెల్స్ పేరిట ఓ బ్రాడ్కాస్ట్ సదుపాయాన్ని తీసుకొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో అద్భుతమైన ఫీచర్ ను తీసుకొచ్చింది. బ్రాడ్కాస్ట్ తరహాలో వాట్సాప్ ఛానల్స్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇదో వన్వే ఛానల్ లాంటిది.

దీంతో ఒకేసారి పెద్ద సంఖ్యలో సందేశాలు పంపించొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది. మీరు కోరుకున్న వ్యక్తులు, సంస్థల నుంచి కావాల్సిన అప్డేట్లను ఈ ఛానల్స్ ద్వారా పొందొచ్చని పేర్కొంది. ఇది సాధారణ చాట్లతో పోలిస్తే కాస్త మెరుగైనది. వ్యక్తులు, సంస్థలను ఫాలో అయ్యే వారి వివరాలు ఇతర ఫాలోవర్స్ కు తెలియవు. అచ్చం బ్రాడ్కాస్ట్ టూల్లా ఇది పనిచేస్తుంది.

ఈ ఛానల్ అడ్మినిస్ట్ర్టర్ తమ ఫాలోవర్స్ కు టెక్ట్స్ , ఫోటోలు, వీడియోలు, స్టిక్కర్స్, పోల్స్ ను పంపించుకోవచ్చు. ఇందుకోసం అప్డేట్స్ అనే ట్యాబ్‌ను వాట్సప్ తీసుకొస్తోంది. ఇందులో స్టేటస్లతో పాటు, చానల్స్ కు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది. ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసినట్లు ప్రకటించిన నేపథ్యంలో కొన్ని గంటల్లో అందరికీ ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.