మహేష్ గొప్పతనం గురించి ఆ స్టార్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మహేష్,శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది అందరికీ తెలిసిందే. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ హీరో తో సినిమా తీశాడు అంటే ఆ సినిమా ఒక రేంజ్ లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ బ్రహ్మోత్సవం సినిమా చాలా చండాలంగా ఉంది అంటూ విమర్శలు వచ్చాయి. సినిమా చూసిన వాళ్లంతా లో కథ లేదు.
కథ లేకుండా సినిమా ఎలా తీశారు డైరెక్టర్ ని ప్రశ్నించారు.

డైరెక్టర్ నే కాకుండా,మహేష్ బాబును కూడా కథ ఎంచుకోవడం రాదు అంటూ అందరూ నిందించారు. నిజానికి మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత డిజాస్టర్ సినిమా ఏదైనా ఉంది అంటే అది బ్రహ్మోత్సవం సినిమా అని చెప్పాలి. మహేష్ కి అంత పెద్ద డిజాస్టర్ సినిమా ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల అని మాత్రం మహేష్ బాబు ఒక్క మాట కూడా అనలేదట. తాజాగా శ్రీకాంత్ అడ్డాల ‘పెద్దకాపు 1’ అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. ఆ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం సినిమా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ ‘ మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాపై చాలా నమ్మకం ఉంది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఆయన చాలా నిరుత్సాహపడ్డారు. కానీ నా దగ్గర మాత్రం ఏం మాత్రం అసహనం వ్యక్తం చేయకుండా, మంచి ప్రయత్నం చేసాం కానీ అది ప్రేక్షకులకు నచ్చలేదు. తప్పకుండా మళ్ళీ కలిసి వర్క్ చేద్దాం ‘ అంటూ శ్రీకాంత్ కి చెప్పినట్లు అతను ఇంటర్వ్యూలో  వెల్లడించాడు. దాంతో మీడియా వారు మళ్లీ మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా, కచ్చితంగా మంచి కథ తో మహేష్ బాబును కలుస్తాను అంటే శ్రీకాంత్ చెప్పాడు