వైట్ చుడిదార్ లో ఊపిరాడకుండా చేస్తున్న శ్రీలీల.. గిలగిలా కొట్టేసుకుంటున్న కుర్రాళ్ళు!

టాలీవుడ్ లో మోస్ట్ బిజీ బ్యూటీ ఎవరు అంటే అందరూ టక్కున చెప్పే పేరు శ్రీలీల. ఈ అందాల భామ తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చిన రెండేళ్లలోనే స్టార్ అయిపోయింది. అటు యంగ్ హీరోలతో పాటు ఇటు టాప్ స్టార్ట్స్ కు కూడా మోస్ట్ వాంటెడ్ గా మారింది. ప్రస్తుతం శ్రీ లీల తెలుగులో 8 సినిమాలు కన్నడలో రెండు సినిమాలు చేస్తూ క్షణం తీరక లేకుండా గడుపుతోంది.

అలాగే సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ సంపాదించుకునేందుకు తరచూ అదిరిపోయే ఫోటోషూట్లతో కుర్ర కారుకు నిద్ర పట్టకుండా చేస్తోంది. తాజాగా వైట్ కలర్ చుడీదార్ లో అందంగా ముస్తాబై.. మత్తెక్కించే అందాలతో ఫోటోలకు పూజలు ఇచ్చింది. చురకత్తుల్లాంటి చూపులతో రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. శ్రీలీలను అలా చూశాక కుర్రాళ్ళు ఊపిరాడక గిలగిలా కొట్టేసుకుంటున్నారు.

ప్రస్తుతం శ్రీ లీల తాజా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు శ్రీలీల లేటెస్ట్ పిక్స్ పై లైకుల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ నెలాఖరులో శ్రీలీల స్కంద మూవీతో ప్రేక్షకులను పలకరించబోతోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రామ్ పోతునేని కాంబినేషన్లో రూపుదిద్దుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలోనే స్కంద ప్రమోషన్స్ కు శ్రీలీల సిద్ధం అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Sreeleela (@sreeleela14)